• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఎం జగన్ సమర్ధతకు పరీక్ష : ఏపీలో వాణిజ్య దౌత్య సదస్సు : చంద్రబాబుకు సమాధానంగా..!

|

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ సత్తా నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు పాలనా వ్యవహారాలకే పరిమితమైన ముఖ్యమంత్రి ఇక ఇప్పుడు విదేశీ ప్రతినిధుల తో సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ పేరిట వాణిజ్య దౌత్య సదస్సు జరగనుంది. భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు అంతర్జాతీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ మారిందన్న విషయాన్ని చాటి చెప్పనున్నారు. 35కు పైగా దేశాల రాయబారులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ సీఎం అయితే ఏపీకి పెట్టుబడులు రావని చంద్రబాబు పదేపదే ఆరోపించారు. ఇప్పుడు జగన్ దీనికి ఈ సదస్సు ద్వారా సమాధానం చెప్పనున్నారు.

ఎంపీ మాధవ్ నిరసనతో కలకలం : మంత్రులు..విదేశీ ప్రతినిధుల ముందే : జగన్ ఆగ్రహం...!

విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌..

విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌..

విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలను వివరించనున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు లక్ష్యం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న 974 కిలోమీటర్ల కోస్తా తీరంలో మౌలిక వసతుల అభివృద్ధికి గల అవకాశాలను వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు, పారిశ్రామిక విధానాలు, పర్యాటకం, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విదేశీ ప్రతినిధులకు తెలియజేస్తారు.

ముఖ్యమంత్రి కీలకోపన్యాసంతోనే...

ముఖ్యమంత్రి కీలకోపన్యాసంతోనే...

ఈ సదస్సుకు దక్షిణ కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, బల్గేరియా, మాల్దీవులు, ఈజిప్ట్, నమీబియా, స్లోవేకియా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్, జార్జియా, జపాన్, అమెరికా, కెనడా, నెదర్లాండ్స్‌ తదితర దేశాల ప్రతినిధులు, రాయబారులు హాజరవుతున్నారు. డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరగనుంది. విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పి.హరీష్‌ అతిథులకు స్వాగతం పలకడంతో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి క్లుప్తంగా సదస్సు లక్ష్యాలను వివరిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వ అజెండాను ఎల్వీ సుబ్రహ్మణ్యం, నవరత్న పథకాలపై ఎం.శామ్యూల్, రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై రజిత్‌ భార్గవ, టూరిజం, బుద్ధిష్ట్‌ సర్క్యూట్స్‌పై కె.ప్రవీణ్‌ కుమార్, హెల్త్‌ టూరిజం, వైద్య రంగంలో పెట్టుబడులపై డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి వివరించనున్నారు. అనంతరం వివిధ దేశాల హైకమీషనర్లు, అంబాసిడర్లతో అధికారులు చర్చలు జరుపుతారు.

15 దేశాల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి..

15 దేశాల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి..

ఈ సదస్సులో భాగంగా 15కు పైగా దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముంది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనేక దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ కావడానికి ఆసక్తిగా ఉన్నారు. అయితే, సమయాభావం వల్ల కేవలం 13 నుంచి 15 దేశాల ప్రతినిధులతో మాత్రమే చర్చలు జరిపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ సమర్ధతకు ఈ సదస్సు కీలకంగా మారనుంది. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి పెట్టుబడులు రావని.. వచ్చిన పెట్టుబడులే వెళ్లిపోతాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు విమర్శించారు. ఇప్పుడు జగన్ ఈ సదస్సు విజయవంతం చేయటం..ఏపీలో పెట్టుబడులకు విదేశీ ప్రతినిధులను ఒప్పించ గలిగితే సీఎం జగన్ కు ఇది మైలేజ్ ఇవ్వనుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Diplomatic out Reach seminar in conucting in AP Capital to day. Indian Foreign Affairs and AP Govt conducting this event.Nealy 35 countires representative may attend for this seminar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more