వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంపై చర్చ జరపండి .. లేకుంటే రాజీనామా చేస్తానన్న వైసీపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేస్తానని ప్రకటించి షాక్ కు గురి చేశారు. అందులోనూ అధికార పార్టీ అయిన వైసిపి కి సంబంధించిన ఎమ్మెల్యే రాజీనామా చేస్తాననడం తో అది ప్రస్తుత ఏపీ లోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలింతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు ? ఎందుకు రాజీనామా చేస్తానని ప్రకటించారు ? అసలేం జరిగింది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

కేంద్రం చెప్పిందే జరుగుతుందా .. పీపీఏల విషయంలో జగన్ సర్కార్ నోటీసులకు ట్రిబ్యునల్ స్టే కేంద్రం చెప్పిందే జరుగుతుందా .. పీపీఏల విషయంలో జగన్ సర్కార్ నోటీసులకు ట్రిబ్యునల్ స్టే

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి రాజీనామా చేస్తానని శుక్రవారం నాడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.శుక్రవారం నాడు అసెంబ్లీలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చ జరగకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.ఈ విషయమై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన స్పీకర్ ను పట్టుబట్టారు . గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. అన్నా రాంబాబు కు మంత్రి అనిల్ కుమార్ కూడ మద్దతుగా నిలిచారు. ఈ విషయమై చర్చ జరగాలని ఆయన కూడ అభిప్రాయపడ్డారు.

Discuss the matter .. Otherwise i will resign as a MLA

అయితే ఈ విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయమై సభా నాయకుడితో చర్చించి నిర్ణయం తీసుకొందామని ఆయన ప్రకటించారు. దీంతో రాంబాబు మెత్తబడ్డారు. మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ లో చర్చ జరపాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోరటం , ఒకవేళ ఆ అంశంపై చర్చ జరగకుంటే తానూ రాజీనామా చేస్తానని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకటించటం కలకలం రేపింది.

English summary
Giddaluru MLA Anna Rambabu on Friday announced that he will resign from his post. He said he would resign from the post of MLA if there was no debate on the matter.Giddaluru MLA Anna Rambabu in the Assembly has demanded a debate on the defects of the party. He said he would resign from the post of MLA if there was no debate on the matter. He referred to the consequences of the past government damage. Minister Anil Kumar also supported Anna Rambabu. He also believes that this should be discussed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X