తప్పేం చేయలేదు.. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి షాకింగ్ స్పందన!
తిరుమల కొండపై కేక్ కట్ చేసిన వివాదం పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పందించారు. తాము తిరుమల కొండ పైన ఎటువంటి తప్పు చేయలేదని, ఇక ఈ వివాదంలో బిగ్ బాస్ ఫేమ్ తనూజకు ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పారు . తనూజ ను సర్ప్రైజ్ చేయడానికి తాము కేక్ తీసుకొచ్చామని, ఆ కేక్ వ్యవహారంలో తనూజకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తిరుమల కొండపై మేమే తప్పు చేయలేదు: దువ్వాడ శ్రీనివాస్, మాధురి
తిరుమల కొండపైకి తాము ఎగ్ లెస్ కేక్ మాత్రమే తీసుకువచ్చామని, తాము ఎటువంటి అపచారం చేయలేదని వారు చెప్పారు. కేక్ కటింగ్ విషయాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం పెద్దది చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. తమపై కేసులు పెడుతున్నట్లుగా తెలిసిందని తాము వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.

ఏదో పాపం చేసినట్టు ప్రచారం చేస్తున్నారు
తాను శ్రీవారి పరమ భక్తుడిని అని, తాను ఏ విధమైన అపచారం చేయలేదని ఆయన వెల్లడించారు. తమపై పెట్టిన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని వారు ఇరువురు ప్రకటించారు. పుట్టినరోజు సందర్భంగా ఆమెను సర్ప్రైజ్ చేయడానికి కేక్ తీసుకు వెళ్లామని, దీనిలోకి తనూజను ఎందుకు లాగుతున్నారు అని వారు ఇరువురు ప్రశ్నించారు. పుట్టినరోజు చేసుకోవడం అదేదో పాపం చేసినట్టు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలలో కేక్ కట్ చేయటంపై దివ్వెల మాధురి
రెండు రోజులుగా అన్ని వార్త ఛానల్స్ లో తన పేరు వినిపిస్తోందని, తానేదో పెద్ద నేరం చేసినట్టు చిత్రీకరిస్తున్నారని వాపోయారు. అసలు తిరుమలలో కేక్ కట్ చేయకూడదు అనే విషయం ముందు తమకు తెలియదని, తెలిసి ఉంటే చేసే వాళ్ళమే కాదని పేర్కొన్నారు. అనవసరమైన వివాదాలు కోరుకోనని దివ్వెల మాధురి స్పష్టం చేశారు.
పూర్తి బాధ్యత నాదే, తనూజను ఇబ్బంది పెట్టొద్దు
తాను కూడా శ్రీవారి భక్తురాలినేనని, తనకు టిటిడి నియమాలు తెలియకపోవడం వల్ల జరిగిన పొరపాటు ఇదని దివ్వెల మాధురి పేర్కొన్నారు. కేక్ కట్ చేయడం తప్పయితే దానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని, తనూజను ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు అన్నారు.












Click it and Unblock the Notifications