కిరణ్‌పై డిఎల్, ఎన్టీఆర్‌కి కితాబు: సిఎం కొత్తపార్టీపై డొక్కా

ప్రభుత్వం పథకాలు, వాటి అమలు తీరు తెలియని వారు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బ్రిజేష్ కుమార్ కమిటీ తీర్పుతో కడప జిల్లాకు అన్యాయం జరుగుతుందన్నారు.
కిరణ్ పార్టీని వీడరు: డొక్కా
ముఖ్యమంత్రి కిరణ్ కాంగ్రెసు పార్టీని వీడరని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హైదరాబాదులో అన్నారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారనేది ఊహాగానాలు మాత్రమేనని చెప్పారు. తెలంగాణ అయినా, రాయల తెలంగాణ అయినా తాను తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నిర్ణయంలో దేశ ప్రయోజనం ఉంటుందన్నారు. అమరావతిని లేదా కొండవీడును కొత్త రాజధానిగా చేయాలని డొక్కా విజ్ఞప్తి చేశారు.
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక భేటీ
హైదరాబాదులోని ఎపిఎన్జీవో కార్యాలయంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించారు.












Click it and Unblock the Notifications