పవన్ కు డీఎంకే ఘాటు కౌంటర్-వారికి మీరే అసలు శత్రువులు..!

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నిన్న తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో కోర్టులతో పాటు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ పైనా ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ విమర్శలపై డీఎంకే స్పందించింది.

నిన్న పవన్ తిరుపతిలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడని పవన్ నిన్న తిరుపతిలో వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచిపెట్టుకుని పోతారంటూ ఉదయనిధిపై విమర్శలు గుప్పించారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా అంటూ పవన్ హెచ్చరికలు జారీ చేశారు.. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా ఇవాళ పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.

dmk reacted strongly on pawan kalyan s remarks on his counterpart udayanidhi stalin

తమ పార్టీ ఏ మతం గురించి లేదా ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదని, అయితే కుల దురాగతాలు, అంటరానితనం, కుల వ్యవస్ధ గురించి మాత్రం మాట్లాడుతూనే ఉంటుందని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణే అని ఆయన తెలిపారు. వారే హిందుత్వానికి అసలైన శత్రువులున్నారు. కుల అంటరానితనంపై డీఎంకే బాబా అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్, ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల విధానాలనే అమలు చేస్తుందన్నారు. వీటికి వ్యతిరేకంగా ఉన్న విధానాల్ని డీఎంకే వ్యతిరేకిస్తూనే ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+