హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మార్కుల జాబితా చూస్తారా? ఆయ‌న‌కు ఎన్ని మార్కులు వ‌చ్చాయో తెలుసా?

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు బేగంపేట్‌లోని హైద‌రాబాద్‌ ప‌బ్లిక్ స్కూల్ చ‌దివార‌నే విష‌యం మ‌న‌కు తెలుసు. ఇంట‌ర్మీడియ‌ట్ త‌రువాత ఆయ‌న ఏం చేశారు? డిగ్రీ ఎక్క‌డ చ‌దివారు? ఏ క‌ళాశాల‌లో ఆయ‌న త‌న మూడేళ్ల డిగ్రీని పూర్తి చేశారు? డిగ్రీలో ఆయ‌న తీసుకున్న కోర్స్ ఏది? ఆయ‌న‌కు ఎన్ని మార్కులు వ‌చ్చాయి? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ సమాధానం దొరికింది.

హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య‌ను పూర్తి చేసుకున్న త‌రువాత ఆయ‌న ప్ర‌గ‌తి మ‌హా విద్యాల‌యాలో డిగ్రీలో చేరారు. కామ‌ర్స్ ప్ర‌ధాన స‌బ్జెక్ట్‌గా మూడేళ్ల డిగ్రీని ఆయ‌న అక్క‌డే పూర్తి చేశారు. బిజినెస్ ఎకనమిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టాటిస్టిక్స్‌, బ్యాంకింగ్‌, బిజినెస్ ఆర్గ‌నైజింగ్ మేనేజ్‌మెంట్‌, సైన్స్ అండ్ సివిలైజేష‌న్‌ల‌ల్లో ఆయ‌న త‌న డిగ్రీని పూర్తి చేశారు. క‌మ‌ర్షియ‌ల్ అండ్ ఇండియ‌న్ లా, కంపెనీ లా అండ్ ఆడిట్, కాస్ట్ అకౌంటెన్సీ, ఇన్‌క‌మ్ ట్యాక్స్ స‌బ్జెక్ట్‌ల‌ల్లో వైఎస్ జ‌గ‌న్‌కు మంచి ప‌ట్టు ఏర్ప‌డింది అక్క‌డే.

Do you want to see Chief Ministe of AP YS Jagans Degree Mark list? Do you know How many marks he was secured?

త‌న మూడేళ్ల డిగ్రీని ఆయ‌న ఫ‌స్ట్‌క్లాస్‌తో పూర్తి చేశారు. మొత్తం 740 మార్కుల‌ను ఆయ‌న సాధించారు. మార్కుల జాబితాను 1994 జూన్ 17వ తేదీన జారీ చేశారు. ఈ మార్కుల జాబితాపై ప్ర‌గ‌తి మ‌హా విద్యాల‌యా డిగ్రీ క‌ళాశాల ర‌బ్బ‌ర్ స్టాంప్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఉస్మానియా యూనివ‌ర్శిటీకి అనుబంధంగా ఈ క‌ళాశాల ప‌నిచేస్తోంది.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy has completed his Degree in Pragathi Maha Vidyalaya in Hyderabad in 1994. The Pragathi Maha Vidyalaya Degree College is affiliated with prestigious Osmania University. YS Jagan has completed his Three Years Degree in Commerce. He was secured 740 Marks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X