టీడీపీకి షాక్: వైసీపీలోకి కీలక నేత.. మరో 50మంది కార్యకర్తలు..
కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు.
బనగానపల్లె: కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు.
Recommended Video

కోవెలకుంట్ల మండలం కంపమళ్లమెట్ట వద్ద సుమారు 50మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అందరికీ కండువాలు కప్పి జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

రామిరెడ్డితో పాటుగా కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్, మాజీ ఎంపీటీసీ కుమార్, మద్దూరు రామసుబ్బారెడ్డి, కైఫా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, మహేష్ తో పాటు పలువురు వైసీపీలో చేరారు.
కాగా, శుక్రవారం వరకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకున్న జగన్.. శనివారం మధ్యాహ్నం బనగానపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించారు. అక్కడ నుంచి ఉయ్యాలవాడ క్రాస్ రోడ్ , భీమునిపాడు , పెరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల బస్టాండ్ సెంటర్ మీదుగా కర్రా సుబ్బారెడ్డి విగ్రహాం వరకు పాదయాత్ర సాగనుంది.












Click it and Unblock the Notifications