డాక్టర్ సూర్యకుమారి డెత్ మిస్టరీ: ఆ రోజు ఏం జరిగింది?, కీలకంగా మారిన మేసేజ్
ఐదు రోజుల క్రితం అదృశ్యమైన డాక్టర్ సూర్యకుమారి మృతదేహం రైవస్ కాలువలో లభించింది. అయితే విద్యాసాగర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఐదురోజుల తర్వాత శవంగా దొరికింది.
విజయవాడ: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన డాక్టర్ సూర్యకుమారి మృతదేహం రైవస్ కాలువలో లభించింది. అయితే విద్యాసాగర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఐదురోజుల తర్వాత శవంగా దొరికింది. అయితే విద్యాసాగర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
క్రీస్తురాజపురం ఫిల్మ్‌నగర్ కాలనీలో కొర్లపాటి మరియమ్మ , విజయకుమర్ దంపతులు నివాసం ఉంటున్నారు. విజయకుమార్ నగరపాలక సంస్థలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. వీరికి నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు.
వీరి కుమార్తెల్లో ఒకరైన హెబ్సిబా కర్ణాటక రాష్ట్రంలో ఐఎఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు ఎంబిబిఎస్ పూర్తి చేసి పిహెచ్‌సిల్లో పనిచేస్తున్నారు. వీరిలో సూర్యకుమారి విసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలోని పిహెచ్‌సిలో వైద్యురాలిగా పనిచేస్తోంది.
రైవస్ కాలువలో నిడమానూరు వద్ద శవాన్ని పోలీసులు శనివారం రాత్ర స్వాధీనం చేసుకొన్నారు.ఐదు రోజుల క్రితం నుండి ఆమె శవం నీళ్ళలోనే ఉండడంతో గుర్తుపట్టడానికి కూడ వీలులేకుండా పోయింది.

ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
కుటుంబసభ్యులతో గొడవపడి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ద్విచక్రవాహనంపై స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ ఇంటికి వెళ్ళింది డాక్టర్ సూర్యకుమారి. అయితే అక్కడే కొద్దిసేపు వారిద్దరూ మాట్లాడుకొన్నారు. అక్కడి నుండి సూర్యకుమారి ఆవేశంగా బయటకు వచ్చినట్టు సమాచారం. సూర్యకుమారి ఇంటికి వెళ్ళి విద్యాసాగర్ మీ అమ్మాయి ఫోన్ మరిచిపోయిందంటూ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడని కుటుంబసభ్యులు అంటున్నారు. విద్యాసాగర్ ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనే విషయమై అంతుబట్టడం లేదు. సూర్యకుమారి ఆత్మహత్య చేసుకొందా, లేక ఎవరైనా ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా అనేది అంతుబట్టడం లేదు. సూర్యకుమారి చివరిసారిగా విద్యాసాగర్‌తోనే మాట్లాడిందని చెబుతున్నారు. ఈ విషయంలో తనకేమీ తెలియదని విద్యాసాగర్ అంటున్నారు. అయితే విద్యాసాగర్ నోరు తెరిస్తే ఈ విషయంలో ఏం జరిగిందనేది బయటకు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video


విద్యాసాగర్‌తో ప్రేమ వ్యవహరం
మాజీ ఎమ్మెల్యే జయరాజు కుమారుడు విద్యాసాగర్‌తో డాక్టర్ సూర్యకుమారి మధ్య ప్రేమ వ్యవహరం ఉందని ప్రచారం సాగుతోంది.అయితే సూర్యకుమారితో కాకుండా మరో మహిళను విద్యాసాగర్ వివాహం చేసుకొన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. అయినా కూడ వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహరం సాగుతోందంటున్నారు. దీంతో వీరిద్దరూ రహస్యంగా కలుసుకొనేవారని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఈ విషయం తెలిసి సూర్యకుమారి కుటుంబసభ్యులు ఆమెను మందలించారని తెలుస్తోంది.

విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు
డాక్టర్ సూర్యకుమారి అదృశ్యమైన తర్వాత ఆమె కుటుంబసభ్యులు విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఆయన నుండి ఎలంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. మరోవైపు సూర్యకుమారి శవం దొరికిన తర్వాత మరోసారి పోలీసులు విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

చంపేస్తారేమో..
డాక్టర్ సూర్యకుమారి సెల్‌ఫోన్ నుండి విద్యాసాగర్ సెల్‌ఫోన్‌కు జూలై 17న, ఓ మేసేజ్ వచ్చింది.'' గొబ్బిశ్రీ నిన్ను ఎంతగానో ఇష్టపడ్డానో, పెళ్ళి చేసుకోమని వెంటపడ్డాను. నువ్వు కాదన్నా నిన్ను బలవంతం చేశాను. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. నీ నుండి దూరంగా పంపాలని వాళ్ళు ఆలోచిస్తున్నారనిపిస్తోంది. నేను అలర్ట్‌గా ఉన్నా.. నువ్వూ జాగ్రత్తగా ఉండు''. అంటూ మేసేజ్ వచ్చింది. సూర్యకుమారిని పీజీ చేయించాలని కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నారు. అక్కడికి వెళ్ళడం ఇష్టంలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో కూడ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తన భర్తకు డాక్టర్ సూర్యకుమారితో సంబంధాలున్న విషయాన్ని విద్యాసాగర్ భార్య పోలీసులకు చెప్పింది.

బైక్, చెప్పుల ఆధారంగా సూర్యకుమారి ఆచూకీ
సూర్యకుమారి ఉపయోగించే బైక్, చెప్పుల ఆధారంగా రైవస్ కాలువలో ఆమె మృతదేహన్ని పోలీసులు శనివారం నాడు కనుగొన్నారు. దీంతో రైవస్ కాలువలో ఎన్‌డిఆర్ఎఫ్ బృందంతో వెతికిస్తే సూర్యకుమారి మృతదేహం విజయవాడకు సమీపంలోని నిడమానూరు వద్ద లభ్యమైంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications