Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డెలివరీలో వైద్యుల నిర్లక్ష్యం .. ఘోషా ఆస్పత్రిలో దారుణంగా శిశువు మృతి

పండంటి బిడ్డ పుడతాడని గంపెడాశతో ఆసుపత్రికి వెళ్లిన ఓ తల్లి వైద్యులు చేసిన నిర్వాకానికి గుండెలవిసేలా రోదిస్తున్నారు. తొమ్మిది నెలలు మోసి తన బిడ్డను కళ్లారా చూసుకుందాం అనుకున్న ఆ తల్లి డెలివరీ అయిన తర్వాత బిడ్డ పరిస్థితి చూసి కన్నీరు మున్నీరు అవుతోంది. తనబిద్దను ఎత్తుకోవాలని ఆశపడిన ఆ తండ్రి బిడ్డ మరణంతో ఆవేదన చెందుతున్నాడు.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల పగిలి మెదడు బయటకు వచ్చి మృతి చెందిన శిశువును చూసి అక్కడి వారంతా ఆవేదనకు గురయ్యారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే విశాఖలోని విక్టోరియా ఘోషా ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది . వైద్యులు నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతో ఓ శిశువు తల పగిలి మెదడు బయటకు వచ్చి మృతి చెందింది. దీంతో శిశువు మృతదేహంతో ఆస్పత్రి ముందు శిశువు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Doctors negligence in delivery .. new born baby died in Ghosha hospital

గతంలోనూ ఘోషా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన ఘటన లు చోటుచేసుకున్నాయి. కానీ సంబంధిత డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉదంతంపై సైతం ఆసుపత్రి వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి . తమకేమీ సంబంధం లేదు అన్నట్టు వైద్యులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మృతి చెందిన శిశువు తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+