మూడుకు విరుగుడు ఇదే ? కర్నూల్లో బయటపెట్టిన చంద్రబాబు- చివరికి బీజేపీ ఐడియాతోనే ?

ఏపీలో రాజధానుల పోరు సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని తెరపైకి తెస్తుంటే, విపక్షాలు అమరావతినే రాజధానిగా కొనసాగించమని కోరుతున్నాయి. దీంతో తన మాటే నెగ్గించుకునేందుకు వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం తేలాల్సి ఉంది. అయితే ఆలోపు విపక్షాలపై జగన్ పెంచుతున్న ఒత్తిడి వారిని ప్రత్యామ్నాయాల దిశగా ఆలోచింపచేస్తోంది. ఈ క్రమంలో విపక్ష నేత చంద్రబాబు కర్నూలు టూర్ లో చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

రాజధానుల పోరులో ట్విస్టులు

రాజధానుల పోరులో ట్విస్టులు

ఏపీలో సాగుతున్న అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరులో రోజుకో ట్విస్టు తప్పడం లేదు. ముఖ్యంగా అమరావతికి మద్దతుగా పాదయాత్ర చేస్తున్న రైతులకు ప్రభుత్వం అనూహ్య రీతిలో బ్రేక్ వేసింది. అదే సమయంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు విపక్షాల సాయంతో చేస్తున్న పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సిఉంది. అయితే ఆలోపే మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 16 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న రాజకీయ పార్టీల నేతలు జనంలో తిరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలకు బీజం పడుతోంది.

మూడు రాజధానులకు ప్రత్యామ్నాయం

మూడు రాజధానులకు ప్రత్యామ్నాయం

అమరావతి రాజధాని స్ధానంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తుండగా.. ఇప్పటివరకూ అమరావతిని కొనసాగించడమే ప్రత్యామ్నాయమని చెబుతున్న విపక్షాలు.. తాజాగా రూటుమారుస్తున్నాయి. ఒక వేళ సుప్రీంకోర్టు తీర్పుతో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగడం కష్టంగా మారితే, లేక ఎన్నికల్లో అమరావతికే మద్దతివ్వాలని రాయలసీమను ఒప్పించాల్సిన పరిస్దితులే వస్తే అప్పుడు ఏం చెప్పాలనే దానిపై ప్రత్యామ్నాయాల్ని విపక్షాలు అన్వేషిస్తున్నాయి. దీంతో పలు ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నాయి. వీటిని జనం ఎంతవరకూ ఒప్పుకుంటారో తెలియదు కానీ విపక్షాలు మాత్రం వీటిని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కర్నూల్లోనే హైకోర్టుకు చంద్రబాబు ఓకే ?

కర్నూల్లోనే హైకోర్టుకు చంద్రబాబు ఓకే ?

మూడు రాజధానుల్లో భాగంగా కర్నూల్లో న్యాయ రాజధానికి వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే ఇప్పటివరకూ టీడీపీ దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు తన కర్నూలు టూర్ లో ఇక్కడే హైకోర్టు ఉండాలని తాను ఎప్పుడో ప్రతిపాదించానని చెప్పుకొచ్చారు. తద్వారా కర్నూల్లో హైకోర్టు పెడితే తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవనే విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. కర్నూల్లో తన టూర్ ను అడ్డుకునేందుకు లాయర్లు, వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్న తరుణంలో చంద్రబాబు ఈ విషయాన్ని బయటపెట్టారు.

బీజేపీ బాటలోనే చంద్రబాబు ?

బీజేపీ బాటలోనే చంద్రబాబు ?

ఇప్పటికే తోటి విపక్షం బీజేపీ కూడా కర్నూల్లో హైకోర్టును ప్రతిపాదిస్తోంది. ఓవైపు అమరావతి రాజధానికి మద్దతిస్తున్న బీజేపీ.. రాయలసీమ డిక్లరేషన్ ప్రకారం కర్నూల్లో హైకోర్టుకు మద్దతిస్తోంది. ఇప్పుడు కర్నూల్లో హైకోర్టును తాను ఎప్పుడో ప్రతిపాదించానని చంద్రబాబు కూడా ప్రకటించడంతో ఈ ప్రతిపాదనకు మరింత మద్దతు లభించినట్లయింది. అలాగే వైసీపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న కర్నూలు హైకోర్టు ప్రతిపాదనకు కూడా అక్కడి నుంచే చంద్రబాబు మద్దతు ప్రకటించడం సమీకరణాల్ని మార్చబోతోంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు కర్నూలు హైకోర్టుకు బహిరంగంగా మరింత క్లారిటీగా మద్దతు ప్రకటిస్తే ఆ ప్రభావం పొత్తు ప్రయత్నాలపై కచ్చితంగా ఉండి తీరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+