జగన్ ను చంద్రబాబే కాపాడుతున్నారా ? తిరుగులేని సాక్ష్యం..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో పాతికేళ్ల పాటు సౌర విద్యుత్ సరఫరా కోసం కుదిరిన డీల్ , ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దకు అందినట్లు చెబుతున్న ముడుపుల వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వ మౌనంపై ప్రశ్నలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ డీల్ పై సమగ్రంగా పరిశీలించి ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు బహిరంగంగా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి.

తాజాగా అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ .. అప్పట్లో అధికారులు ఎంత వద్దన్నా సీఎంగా జగన్ వినకుండా ఈ డీల్ పై ముందుకెళ్లారని వివరాలు బయటపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు అధికారులతో మాట్లాడాక ఈ నిర్ధారణకు వచ్చినట్లు కూడా చెప్పుకొచ్చింది. అదే సమయంలో అప్పట్లో ఈ డీల్ కు కీలకంగా ఉన్న 19 డాక్యుమెంట్లను ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం బయటపెట్టే అవకాశం ఉన్నా బయటపెట్టడం లేదని రాయిటర్స్ తెలిపింది. దీంతో ఇప్పుడు ఆ 19 డాక్యుమెంట్లు బయటపెట్టాలన్న ఒత్తిడి చంద్రబాబుపై పెరుగుతోంది. ఇదే అంశంపై సెంటర్ ఫర్ లిబర్టీ పేరుతో స్వచ్చంద సంస్థ నడుపుతున్న నలమోతు చక్రవర్తి తాజాగా చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు.

does Chandrababu saving ys jagan mohan reddy over adani solar deal issue

జగన్ని కాపాడుతున్న చంద్రబాబు అంటూ నలమోతు చక్రవర్తి ఓ ట్వీట్ చేసారు. ఇందులో ఆయన ..రాయిటర్స్ అనే ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా సంస్థ చేసిన పరిశోధనలో, ఇప్పటి వరకూ బయటకు రాని 19 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను సంపాదించిందని తెలిపారు. వాటి ప్రకారం జగన్ మోహన్ రెడ్డి తన అధికారుల వారింపులను లెక్క చెయ్యకుండా సెకి-అదానీతో ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. ఈ ఫైళ్ళను ఇంతవరకు దాచిపెట్టింది ఎవరు? చంద్రబాబు గారు అని ప్రశ్నించారు.

ఈ వివరాలు ఎందుకు ముఖ్యం అంటే జగన్ మోహన్ రెడ్డి లంచాల కొరకు ఈ ఒప్పందం చేసుకున్నారు అన్న వాదనను ఈ ఫైళ్లు బలపరుస్తాయన్నారు. చంద్రబాబు గారు ఈ కాగితాలు ఎందుకు దాచారో 4 కోట్ల ఆంధ్రులకు సమాధానం చెప్పాలన్నారు. మీరు జగన్ని ఎందుకు కాపాడుతున్నారో ప్రజలకు తెలియాలని కోరారు. ఈ 19 ఫైళ్ళను వెంటనే బహిరంగం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయన చేసిన ట్వీట్ పై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+