వైసిపికి 'ఖాళీ' షాక్: 'అసెంబ్లీకి రాకుంటే అలా అనర్హత వేటు వేయొచ్చు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ ఎమ్మెల్యేల పైన టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిప్పులు చెరిగారు.

'జగన్‌కు ముందే తెలుసు, అదో ఎత్తుగడ మాత్రమే': పాదయాత్రకు అనుమతి ట్విస్ట్

 అనర్హత వేటు వేయాలి

అనర్హత వేటు వేయాలి

ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డొక్కా డిమాండ్‌ చేశారు.

ఖాళీ అని ప్రకటించే హక్కు ఉంది

ఖాళీ అని ప్రకటించే హక్కు ఉంది

స్పీకర్ అనుమతి లేకుండా సభకు సంబంధించి అన్ని సమావేశాలకు గైర్హాజరైన సభ్యుని సీటును ఖాళీ అని ప్రకటించే హక్కు రాజ్యాంగంలోని 190వ అధికరణం కల్పించిందని చెప్పారు.

ఎందుకు అనర్హత వేటు వేయవద్దో చెప్పాలి

ఎందుకు అనర్హత వేటు వేయవద్దో చెప్పాలి

తదుపరి అసెంబ్లీ సమావేశాలనూ బహిష్కరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం తీర్మానించిన నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదని డొక్కా ప్రశ్నించారు.

అలా చేయడం సరికాదు

అలా చేయడం సరికాదు

ప్రతిపక్ష వైసిపి బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలు కూడా ఆదరిస్తారని లేకుంటే మరోసారి తిరస్కరిస్తారని మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. పాలనలోని లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలను వైసిపి బహిష్కరించడం సరైనది కాదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam party spokesperson Dokka Manikya Varaprasad demanded to Disqualification of YSR Congress party MLAs.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి