వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ టార్గెట్ కిరణ్!: సీన్ లేదని కొత్త పార్టీ అశలపై డొక్కా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dokka Manikya Vara Prasad
గుంటూరు/హైదరాబాద్: మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలనుకునే వారి ఆశ నెరవేరదని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఆయన విభజన అంశంపై స్పందించారు. తాను కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.

కొందరు కాంగ్రెసు పార్టీలో ఉంటూ విమర్శలు చేస్తున్నారని, అది సరికాదన్నారు. పార్టీ విధానాలు నచ్చకుంటే బయటకు వెళ్లిపోవచ్చునని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీలు మనుగడ సాధించలేవన్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదన్నారు.

కాబట్టి కొత్త పార్టీ పెట్టాలనుకునే వారు ఆశలు ఏమాత్రం నెరవేరవన్నారు. విభజన విషయమై అన్ని పార్టీలు మంత్రుల బృందానికి(జివోఎం) నివేదిక ఇవ్వాలన్నారు. కాగా, డొక్కా కొత్త పార్టీ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వర్గాన్ని ఉద్దేశించి అన్నట్లుగా కనిపిస్తోంది. గతంలోను ఆయన పరోక్షంగా కిరణ్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందరు ఒకే మాట మీద ఉండాలి: షబ్బీర్ అలీ

విభజన పైన కాంగ్రెసు పార్టీ, కేంద్రం నుండి ప్రకటనలు వచ్చాక మళ్లీ మొదటికి తీసుకు రావొద్దని, ఎవరు సమైక్యాంధ్ర అనవద్దని శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ వేరుగా చెప్పారు. అధిష్టానానికి కట్టుబడి ఉండి అందరూ ఒకే మాట మీద ఉండాలని సూచించారు. విభజన పైన కాకుండా సమస్యల పైన చర్చించాలని, అందుకు తాము కూడా సహకరిస్తామని చెప్పారు.

రాజ్యాంగ ప్రక్రియలో జోక్యం చేసుకోం: జానా

తాము రాజ్యాంగ ప్రక్రియలో జోక్యం చేసుకొమని, ప్రజల అభిప్రాయాలను చెబుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి వేరుగా చెప్పారు. కాగా తెలంగాణ ప్రాంత నేతలు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అయిన అనంతరం ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో సమావేశమయ్యారు.

English summary
Minister Dokka Manikya Vara Prasad on Monday targetted CM Kiran Kuma Reddy camp leaders again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X