వైసీపీలోకి డొక్కా మాణిక్య వరప్రసాద్: 13న జగన్ సమక్షంలో చేరిక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. జులై 13వ తేదీ ఉదయం 11గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో డొక్కా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది.
ఇటీవలే మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా వైసీపీలో చేరనుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ చేరికలు డొక్కాతోనే ఆగిపోతాయా? లేక ఇంకా మరికొందరు పార్టీ మారే అవకాశం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ముడుపుల కోసమే పట్టిసీమ: బాబుపై ఉండవల్లి ఫైర్
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు.
రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమపై బహిరంగ చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
పట్టసీమ అంచనా వ్యయానికి, వాస్తవంగా పట్టిసీమ కోసం చేస్తున్న ఖర్చుకు మధ్య 206 కోట్ల రూపాయల తేడా ఉందని ఆయన చెప్పారు. దీంతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై పలు అనుమానాలున్నాయని, బహిరంగ చర్చ నిర్వహించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications