'ముఖ్య' అదృశ్య శక్తి వెళ్లొచ్చు: డొక్కా, 24గం.ల్లో.. గండ్ర

Congress
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల వెనుక సీమాంధ్ర ముఖ్య నాయకుడి అదృశ్య శక్తి ఉందని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ బుధవారం ఆరోపించారు. ఆ అదృశ్య శక్తికి ఇష్టం లేకుంటే పార్టీ నుండి వెళ్లి పోవచ్చునని హితవు పలికారు. రాజ్యసభ ఎన్నికల్లో అదృశ్య శక్తి ప్రోత్సహిస్తున్న అభ్యర్థులను తాము ఓడిస్తామన్నారు. సమైక్యాంధ్ర పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

24 గంటల్లో టి బిల్లు ఉండదు: గండ్ర

మరో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో తెలంగాణ బిల్లు ఉండదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి వేరుగా చెప్పారు. విభజన కారణంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకోరని తాము భావిస్తున్నామన్నారు. కిరణ్ తన నోటీసును ఉపసంహరించుకునే వరకు తాము పోరాడుతామని చెప్పారు.

కాగా, శాసనసభ సమావేశాలు గురువారంకు వాయిదాపడ్డాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండుసార్లు వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోయేసరికి సభను రేపటికి వాయిదా వేశారు.

బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల నేతలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరపాలంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు, బిల్లును వ్యతిరేకిస్తూ సిఎం ఇచ్చిన తీర్మానంపై చర్చ జరపాలంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, బిల్లుపై ఓటింగ్ లేదా, తీర్మానం చేయాలంటూ జగన్ పార్టీ ఎమ్మెల్యేల పోడియం వద్ద నినాదాలు చేశారు. సభ్యుల గందరగోళం మధ్యే వివిధ అంశాలపై పలు పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

బిల్లుపై చర్చకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ సభ్యులు తమ నిరసనలు విరమించకపోవడంతో సభ గంటపాటు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కోరినప్పటికీ సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను మరో గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోసారి అదే తీరు నెలకోవడంతో గురువారానికి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+