రాయల టిపై నన్ను అడగొద్దు, టి బిల్లుపై ఇవాళే: షిండే
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాయల తెలంగాణ విషయమై తనను ఏమీ అడగవద్దని మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం అన్నారు. ఇవాళ తెలంగాణ బిల్లు పైన నిర్ణయం ఉంటుందన్నారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
రాయల తెలంగాణపై ఇప్పుడే తాము ఏమీ చెప్పలేమని, దానిపై అడగవద్దన్నారు. ఈ రోజు తెలంగాణ బిల్లుపై నిర్ణయం ఉంటుందన్నారు. ఈ సాయంత్రం జివోఎం సమావేశమవుతుందని, తుది నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. జివోఎం నివేదిక, బిల్లును రేపు తాము ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఇస్తామని, ఎల్లుండి జరిగే కేబినెట్‌కు బిల్లు రావొచ్చన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే: నారాయణ
కాంగ్రెసు పార్టీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చితే అనేక పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాదులో హెచ్చరించారు. రాయల తెలంగాణ జోలికి పోకుండా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. రాయల టి అంటే రాజకీయ సంక్షోభం వచ్చి ఊహించని ఆందోళనలు వస్తాయని చెప్పారు.
బస్సులు నడుపుకోవాలని: కెఈ కృష్ణమూర్తి
కాంగ్రెసు పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను ముక్కలు చేయాలని చూస్తోందని టిడిపి నేత కెఈ కృష్ణమూర్తి కర్నూలు జిల్లాలో ధ్వజమెత్తారు. సీమ కాంగ్రెసు నేతలు బస్సులు నడుపుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి రాయల తెలంగాణ అంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications