వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదాకు, జల్లికట్టుకు సంబంధమేంటి: పవన్ కళ్యాణ్‌కు బీజేపీ

ప్రత్యేక హోదాకు, జల్లికట్టు ఉద్యమానికి సంబంధం లేదని ఏపీ బీజేపీ నేతలు కంభంపాటి హరిబాబు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిలు మంగళవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ప్రత్యేక హోదాకు, జల్లికట్టు ఉద్యమానికి సంబంధం లేదని ఏపీ బీజేపీ నేతలు కంభంపాటి హరిబాబు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిలు మంగళవారం అన్నారు. జల్లికట్టు తరహా హోదా కోసం ఉద్యమించాలని పవన్ కళ్యాణ్, జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

'హోదాపై పవన్ కళ్యాణ్ చెప్పేదంతా అబద్దం', 'మోడీని కలవొచ్చు కదా'

కర్నులులో బీజేపీ కార్యవర్గం భేటీ అయింది. ఈ భేటీకి పురంధేశ్వరి, హరిబాబు తదితరులు హాజరయ్యారు.

ఏపీ‌లో అన్ని పోలింగ్ బూత్‌లలో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షులు హరిబాబు అన్నారు. కేంద్రం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందన్నారు.

Don't compare Jallikattu and Special Tag issue: BJP

పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధుల మంజూరు కేంద్రప్రభుత్వ పుణ్యమే అని ఆయన అన్నారు. జల్లికట్టు ఉద్యమ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆందోళన చేయాలనడం సరికాదన్నారు. ఇంతకు జల్లికట్టుకు, హోదాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

బీజేపీపై శైలజానాథ్ ఆగ్రహం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆరోపించారు. పేదల సంక్షేమమే ధ్యేయమని చెప్పిన బీజేపీ నాయకులు కార్పొరేట్‌ శక్తులకు ఎర్రతివాచీ పరుస్తున్నారన్నారు.

అనుమతి లేదు: అందుకే.. విశాఖలో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్!

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. బీజేపీ తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పైన నెపాన్ని నెడుతోందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు.

English summary
BJP leaders on Tuesday said that don't compare Jallikattu protest and Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X