హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేరే రాష్ట్రాలతో పోల్చొద్దు: బాబు, స్వాగతం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: అన్ని రాష్ట్రాల వలె తమ రాష్ట్రాన్ని చూడవద్దని, ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని తాము కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం చిత్తూరు జిల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించామని చెప్పారు. రూ.10,400 కోట్ల అప్పును మాఫీ చేయాలని తాము కేంద్రాన్ని కోరామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వాలని, ఎఫ్ఆర్‌బీఎంను 7 శాతం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరామన్నారు. ఆర్థిక సంఘానికి రెండు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సిఫార్సు చేశామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధి ఇవ్వాలని కోరామన్నారు. విదేశీయులు రాష్ట్రానికి వచ్చి చదివేలా అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని విజయవాడ అయినప్పటికీ.. అభివృద్ధిని వికేంద్రీకరిస్తామన్నారు. రాష్ట్రంను కాకుండా.. జిల్లాలను యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న ఎస్వీ విశ్వవిద్యాలయం వీసీ డబ్ల్యూ రాజేంద్ర.

చంద్రబాబు

చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ.

చంద్రబాబు

చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ.

చంద్రబాబు

చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య

చంద్రబాబు

చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ విప్ మేడ మల్లికార్జున రెడ్డి.

చంద్రబాబు

చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్.

చంద్రబాబు

చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న మంత్రులు పత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి.

మూడు ఆర్థిక సంఘాలను కలుపుకుంటూ విజన్ 2029ని తయారు చేశామని చెప్పారు. 2022 నాటికి ఏపీని దేశంలో మూడో స్థానంలో, 2029 నాటికి మొదటిస్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు రూపొందించామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్నారు. 2018-19 నాటికి ఏపీని డైనమిక్ రాష్ట్రంగా చేస్తామన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఏపీని నాలెడ్జ్ హబ్‌గా చేస్తామన్నారు.

రాష్ట్రంతో పాటు దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామన్నారు. పర్యావరణ సమతుల్యత కాపాడాల్సిన అవసరముందన్నారు. రాయలసీమను కరవురహిత ప్రాంతంగా చేస్తామన్నారు. విభజన తర్వాత ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నామన్నారు. మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని ఆర్థిక సంఘానికి చెప్పామన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరామన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Friday said don't compare AP with other states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X