జగన్-పవన్ గొడవలో తలదూర్చొద్దు:టిడిపి నేతలకు అధిష్టానం సూచన...ఆ సమావేశం రద్దు అందుకే!
అమరావతి:పవన్ పై జగన్ వ్యక్తిగత వ్యాఖ్యల నేపథ్యంలో వారిద్దరి మధ్య నెలకొన్న వివాదంలో తలదూర్చవద్దని పార్టీ నేతలకు టీడీపీ అధిష్ఠానం సూచించింది. అది వాళ్లిద్దరూ తేల్చుకోవాల్సిన విషయమని టిడిపి అధిష్టానం వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

పవన్ పై జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం ఇదే విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించాలనుకొన్న విజయవాడ నగర ఎమ్మెల్యే బొండా ఉమా కు కూడా టిడిపి అధిష్టానం నుంచి ఈ సూచనలు అందడంతో ఆయన వెంటనే మీడియాతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అయితే అంతకుముందే ఇద్దరు,ముగ్గురు మంత్రులతో సహా పలువురు టిడిపి నేతలు అప్పటికే ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని, కుటుంబ సభ్యులను విమర్శల్లోకి లాగి కించపరచడం సరికాదని మంత్రి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలపై మంత్రి స్పందిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. అలాగే కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి కూడా జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అది భార్యల సంఖ్య విషయంపై ఆయన సతీమణులే తేల్చుకుంటారని హితవు పలికారు.












Click it and Unblock the Notifications