శిల్పాబ్రదర్స్ పేరుతో విమర్శలొద్దు, చక్రపాణిరెడ్డి పార్టీలోనే , కానీ...అంతలోనే

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: శిల్పా మోహన్ రెడ్డి మాత్రమే టిడిపి నుండి వెళ్ళిపోయారని, శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీలోనే కొనసాగుతున్నారని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు అనగానే గందరగోళం నెలకొంది. చక్రపాణిరెడ్డి కూడ పార్టీ నుండి వెళ్ళిపోతారని పార్టీ కార్యకర్తలు అరిచారు. కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొనడంతో పార్టీ నాయకులు వారిని శాంతింపచేశారు.

రక్తసంబంధాన్ని వీడను, టిక్కెట్టుకోసం చేరలేదు, కానీ, ఓడిస్తామన్నారు:శిల్పా సంచలనం

శిల్పా మోహన్ రెడ్డిపార్టీని వీడతానని ప్రకటించిన వెంటనే నియోజకవర్గ నాయకులతో పార్టీ నాయకత్వం సమావేశమైంది. పార్టీ నుండి ఎక్కువ సంఖ్యలో వైసీపీలో చేరకుండా జాగ్రత్తలు తీసుకొంది.

don't make allegations in the name of silpa brothers: Kaluva srinivasulu

ఈ సమావేశానికి హజరైన మంత్రి కాలువ శ్రీనివాసులు పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాత్రమే పార్టీని వీడారని చెప్పారు. శిల్పా చక్రపాణిరెడ్డి మాత్రం పార్టీలోనే ఉన్నారని చెప్పారు.

శిల్పా బ్రదర్స్ పేరుతో ఎవరూ కూడ విమర్శలు చేయకూడదని ఆయన పార్టీ నేతలకు సూచించారు. మోహన్ రెడ్డిపైనే విమర్శలు చేయాలన్నారు.మోహన్ రెడ్డి పార్టీలోకి రాకముందే చక్రపాణిరెడ్డి టిడిపిలో ఉన్నారని చెప్పారు. ఇంకా ఆయన పార్టీలోనే ఉన్నారని చెప్పారు.

ఎవరు సహకారమిచ్చినా తీసుకొని ఐకమత్యంగా సాగాలన్నారు. ఆ సమయంలో కొందరు కార్యకర్తలు చక్రపాణిరెడ్డి కూడ వెళ్ళిపోతారని అరిచారు. మున్సిఫల్ చైర్మెన్ ను కూడ పదవి నుండి తొలగించాలని గోల చేశారు. అయితే పార్టీ నాయకులు వారికి సర్ధిచెప్పారు.

మూడేళ్ళ క్రితం పార్టీలోకి వచ్చిన శిల్పా వెళ్ళిపోయినా 35 ఏళ్ళుగా టిడిపిలో ఎంతో ప్రాముఖ్యత పొందిన భూమా కుటుంబం నియోజకవర్గప్రజలకు అండదండగా నిలుస్తోందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
don't make allegations in the name of silpa brothers Ap information minister Kalava srinivasulu suggested to Tdp leaders. Nadyala Tdp leaders meeting held on Tuesday night at Nandyala.
Please Wait while comments are loading...