అబద్దాలు చెప్తారా? ఏపీ అధికారులపై కేంద్ర మంత్రి సీరియస్!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు లో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ఏ.కొండూరులో పర్యటించిన కేంద్ర మంత్రి తాగునీటి సరఫరా గురించి లంబాడి తండా వాసులతో మాట్లాదారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రమంత్రి ఎదుట తండావాసులు తమకు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయని వాపోయారు. ఇక తండావాసులు చెప్పిన సమస్యపై జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారిని వివరణ కోరారు. దాంతో జిల్లా గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారి తాగునీటికి ఇబ్బంది లేదని చెప్పారు.వెంటనే జిల్లా అధికారుల పై సీరియస్ అయిన కేంద్ర మంత్రి ప్రతిరోజు తాగునీటికి ఇబ్బంది లేకపోతే, తండా వాసులు అందరూ అబద్ధం చెప్పారా అంటూ ప్రశ్నించారు.

ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి తప్ప, ఇలా అసత్యాలు మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. నీరు వస్తుంటే ఇక్కడి వారు రావడం లేదని చెబుతారా అని అధికారులను నిలదీశారు. కేంద్ర మంత్రి తీవ్ర స్వరంతో సీరియస్ కావడంతో అధికారులు అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం సెంటర్ ను ఆమె పరిశీలించారు. పేషంట్ ల తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఏ కొండూరు లో డయాలసిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ప్రశ్నించారు. స్థానిక పి.హెచ్.సి ని పరిశీలించి, ఆసుపత్రి సిబ్బందిని అడిగి పనితీరు వివరాలు తెలుసుకున్నారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న లబ్ధి పొందాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సూచించారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి మొత్తం పర్యటనలో జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications