దున్నపోతు అంటే గాడిదంటాం: హరీష్ రావుపై జగ్గారెడ్డి

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై వెనక్కి వెళ్లరని చెప్పారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వడంతో తెరాస నేతలకు పనిలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావులు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. వారు ఒక్కసారి తిడితే తాము రెండుసార్లు తిట్టాల్సి వస్తుందన్నారు. తిట్ల సంప్రదాయం మంచిది కాదన్నారు.
ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాలను చేపట్టి.. సీమాంధ్రలో కూడా పర్యటిస్తారన్నారు. రచ్చబండకు గురించి అడుగుతున్న హరీష్ రావు ఎప్పుడైన ఆ కార్యక్రమానికి హాజరయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఎప్పుడైనా చదువు చెప్పారా అన్నారు. కెసిఆర్ కుటుంబానికి విమర్శలు చేయడమే సరిపోతుందన్నారు. వారు ప్రచారం కోసమే విమర్శలు పనిగా పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఆయన ఆ పరిస్థితుల్లో లేరన్నారు.
మంత్రులను నిలదీయాలి: కోమటిరెడ్డి
తెలంగాణ విషయంలో ఈ ప్రాంత మంత్రులు ముఖ్యమంత్రిని నిలదీయాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర మంత్రులు ఐకమత్యంగా ఉద్యమిస్తుంటే మన నేతలు మాత్రం పదవులు పట్టుకొని వేలాడుతున్నారని ఆరోపించారు. మంత్రులు రాజీనామా చేయకుంటే వారి ఇళ్ల ముందు ధర్నా చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications