• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టిడిపి తో పొత్తు వ‌ద్దు : విజ‌య‌మ్మ‌ కాళ్లు అయినా ప‌ట్టుకుంటాం: ఏపి కాంగ్రెస్ నేత‌ల సంచ‌ల‌నం..!

|

ఏపిలో టిడిపి- కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు లో కొత్త ట్విస్ట్‌. టిడిపి -కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు పై టిడిపి అధినేత అంత‌ర్యం ఇంకా బ‌య‌ట ప‌డలేదు. జాతీయ స్థాయిలో ప్ర‌ధాని మోదీకి వ్య‌తరేకంగా కూట‌మి లో కాంగ్రెస్ కీల‌క‌మ‌ని చంద్ర‌బాబు చెబు తూ వ‌స్తున్నారు. తెలంగాణ‌లోనూ పొత్తు పెట్టుకున్నారు. అయితే అక్క‌డ స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. దీంతో..రెండు పార్టీ ల్లోనూ ఏపిలో పొత్తు పై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఉమెన్‌చాందీ పార్టీ నేత‌ల‌తో నిర్విహించిన స‌మావే శం లో కొత్త వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది...దీంతో..ఉమెన్ చాందీ విస్తుపోయారు..

చంద్ర‌బాబు తో పొత్తు వ‌ద్దు..

చంద్ర‌బాబు తో పొత్తు వ‌ద్దు..

ఏపిలో టిడిపితో పొత్తు పైకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ఉమెన్‌చాందీ..పిసిపి చీఫ్ ర‌ఘువీరా స‌మక్షంలోనే ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు తమ అభిప్రాయాల‌ను నిర్మొహ‌మాటంగా చెప్పేసారు. కొంత మంది టిడిపి తో ఏపిలొ పొత్తు క‌లిసి వస్తుంద‌ని చెప్ప‌గా..మెజార్టీ స‌భ్యులు మాత్రం పొత్తును వ్య‌తిరేకించారు. ఏపిలో ఇప్పుడిప్పుడే పార్టీ తిరిగి కోలుకొనే ప‌రిస్ధితులు క‌నిపిస్తున్నాయ‌ని..ఇప్పుడు టిడిపి తో పొత్తు పెట్టుకుంటే న‌ష్ట పోతామ‌ని వారి వాదించారు. తెలంగాణ లో ఎదురైన ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకోవాల‌నా ఆ నేత‌లు ఉమెన్ చాందీకి సూచించారు. ఏపిలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త బాగా క‌నిపిస్తోందని..ఇటువంటి ప‌రిస్థితుల్లో పొత్తు స‌రి కాద‌ని వారు వివ‌రించారు. జాతీయ స్థాయిలో పొత్తు అక్క‌డి స‌మీక‌ర‌ణాల ఆధారంగా ఉంటుంద‌ని..అయితే, ఏపిలో మాత్రం క్షేత్ర స్థాయిలో టిడిపి -కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఒక పార్టీ కోసం మ‌రొక పార్టీ కేడ‌ర్ స‌హ‌క‌రించుకొనే ప‌రిస్థితి ఉండ‌ద‌ని కాంగ్రెస్ నేత‌లు కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు స‌మాచా రం. చంద్ర‌బాబు తో పొత్తు పెట్టుకుంటే మునిగిపోతామ‌ని ప‌లువురు నేత‌లు స‌మావేశంలో తేల్చి చెప్పారు.

టీడీపీ-జనసేన పొత్తు: టీజీ వెంకటేష్‌తో చెప్పించింది ఎవరు..?

అవ‌స‌ర‌మైతే విజ‌య‌మ్మ కాళ్లు ప‌ట్టుకుంటాం..!

అవ‌స‌ర‌మైతే విజ‌య‌మ్మ కాళ్లు ప‌ట్టుకుంటాం..!

ఇదే సమావేశంలో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు హైక‌మాండ్ ప్ర‌తినిధులు ఆశ్చ‌ర్య‌పోయే ప్ర‌తిపాద‌న తెర మీద‌కు తీసుకొ చ్చారు. ఏపిలో టిడిపి తో పొత్తు వ‌ద్ద‌ని..అవ‌స‌ర‌మైతే వైసిపి తో పొత్తు పెట్టుకుందామ‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందుకోసం అవ‌స‌ర‌మైతే తాము విజ‌య‌మ్మ కాళ్లు ప‌ట్టుకొని అయినా పొత్తుకు ఒప్పిస్తామ‌ని ఆ నేత‌లు ఉమెన్ చాందీతో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఏపిలో విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ పార్టీ కేడ‌ర్ వైసిపి వైపు వెళ్లింద‌ని..ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసిపి తో పొత్తు పెట్టుకుంటేనే ఆ కేడ‌ర్ తిరిగి ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆ నేత‌లు వివ‌రించిన‌ట్లుగా తెలు స్తోంది. టిడిపి తో పొత్తు పెట్ట‌కుంటే ప్ర‌స్తుతం పార్టీని న‌మ్ముకున్న వారు సైతం దూరం అయ్యే అవ‌కాశం ఉంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. పార్టీ హైక‌మాండ్ పొత్తుల విషయంలో ఏమీ తేల్చ‌కుండా ఉండ‌టం వ‌ల‌న..టిడిపి తో స‌ఖ్య‌త గా ఉంటుండ‌టంతో తాము క్షేత్ర స్థాయిలో ఏమీ చేయలేని ప‌రిస్థితి లో ఉండిపోయాని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రాహుల్ గాంధీదే తుది నిర్ణ‌యం..

రాహుల్ గాంధీదే తుది నిర్ణ‌యం..

ఏపి కాంగ్రెస్ నేత‌ల భిన్న వాద‌న‌లు విన్న ఉమెన్ చాందీ ఎవ‌రైనా పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. ఏపిలో పొత్తుల సంగ‌తి పార్టీ అధినేత రాహుల్ గాంధీ చూసుకుంటార‌ని..పార్టీ నేత‌ల అభిప్రాయాల‌ను ఆయ‌న‌కు నివేదిస్తాన‌ని ఉమెన్ చాందీ స్ప‌ష్టం చేసారు. అయితే, టిడిపి తో పొత్తు ఉంటుంద‌ని ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా చెప్ప‌లేద‌ని చాందీ వారికి న‌చ్చ చెప్పారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధినేత్రిని విభేదించి బ‌య‌ట‌కు వెళ్లిన జ‌గ‌న్ పార్టీతో పొత్తు స‌రి కాద‌నే అభిప్రాయం సైతం కొంద‌రు నేత‌లు వ్య‌క్తం చేసారు. వైసిపి అధినేత జ‌గ‌న్ త‌మ తో పొత్తుకు అంగీక‌రించే అవ‌కాశం ఉండ‌ద‌ని మ‌రి కొంద‌రు నేత‌లు విశ్లేషించారు. దీంతో..ఏపిలో కాంగ్రెస్ వ‌చ్చే ఎన్ని క‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తుందా..లేక వైసిపి వ‌ద్ద‌కు రాయ‌బారం న‌డుపుతారా లేక టిడిపితో క‌లిసి వెళ్లాల‌ని హైక‌మాం డ్ నిర్ధేశిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

English summary
AP congress leaders not interest in alliance with TDP in Andhra Pradesh. Some of the state congress leaders proposed tie up with YSRCP in coming elections. But, state in charge says the decision in hands of Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X