వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్షన్లు పేరుతో మభ్యపెట్టొద్దు.!ఆ జీవోలు రద్దు చేయాలన్న పవన్ కళ్యాణ్.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించారు. ఈ సారి విద్యాసంస్థల పట్ల వైసీపి ప్రభుత్వాన్ని నిలదీసారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేస్తేనే విద్యార్థులు, వారి తల్లితండ్రులు చేస్తున్న ఆందోళనకు ఫలితం ఉంటుందని ప్రభుత్వానికి సూచించారు పవన్ కళ్యాణ్. వారు చేస్తున్న డిమాండ్ లో స్పష్టత ఉందని, తమ బిడ్డలు చదువుతున్న విద్యా సంస్థలను ఎప్పటిలాగే కొనసాగించాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఆ విద్యా సంస్థల నిర్వహణ సాగేలా చూడాలని తల్లితండ్రులు కోరుతున్నారు.

అనంతపురం, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము చదివే కాలేజీలు, స్కూళ్ళు ప్రైవేట్ విధానంలోకి వెళ్తే ఫీజులు భరించలేమని చెబుతూనే ఉన్నారని పవన్ గుర్తు చేసారు.తల్లిదండ్రుల, విద్యార్థుల ఆందోళనకు తలొగ్గినట్లు కనిపించినా ప్రభుత్వం- మెమో ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఆప్షన్లు ఇచ్చామని ప్రకటన చేసినా అందులో మతలబులే కనిపిస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆప్షన్ల పేరుతో విద్యార్థులను, తల్లితండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వాహకులకు ఇచ్చిన వాటిలో మొదటి రెండింటినీ బలంగా ప్రభుత్వం చెబుతోంది అంటే కచ్చితంగా ప్రభుత్వం నాలుగు జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉందన్న అంశం అర్థమవుతోందన్నారు జనసైనికుడు. నాలుగు మార్గాలు సూచించాం కాబట్టి విద్యాసంస్థల నిర్వాహకులు ఏదోఒకటి ఎంచుకొంటారంటూ విద్యా శాఖ తన బాధ్యతను తప్పించుకోకూడదని పవన్ స్పష్టం చేసారు.

Dont be fooled by the name of the options!Pawan wants to cancel those GOs!

ఎప్పటిలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగాలి అంటే జీవో 42, జీవో 50, జీవో 51, జీవో 19లను పూర్తిగా రద్దు చేయాలని, 1982నాటి విద్యాహక్కు చట్టాన్నికి విరుద్ధంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయడంతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసారు. ఆందోళనలు తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేందుకు మెమోల రూపంలో ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ప్రభుత్వాన్ని పవన్ హెచ్చరించారు.

English summary
Pawan Kalyan suggested to the government that the abolition of the four GO's given by the government in the case of aided educational institutions would result in the concern of students and their parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X