ఖైరతాబాద్ వినాయకుడిలా ఏపీలో ‘డూండీ’ గణపతి.. నవరాత్రులు షురూ!

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వాడవాడలా గణనాథులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలను చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వినాయక చవితి పండుగ అంటే అదొక సంబరం. తెలుగు రాష్ట్రాలు చెప్పుకునేలా ఘనంగా చేయాలని గణేశ మండళ్ళు పోటీ పడతాయి.

ఇందులో భాగంగా అత్యంత భారీ విగ్రహాలను, ప్రత్యేకత సంతరించుకునే విగ్రహాలను, వేడుకల గురించి విశేషంగా చెప్పుకునేలా హంగు ఆర్భాటాలతో వేడుకలను నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఖైరతాబాద్ గణేషుడికి అంతటి ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో ఏపీలో కూడా ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలకు దీటుగా డూండి గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

Doondi Ganesha in vijayawada Vinayaka Navaratri celebrations on the lines of Khairatabad Ganesh

ఈ సంవత్సరం పర్యావరణ హితమైన 72అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించనున్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 72అడుగుల పంచముఖ వరసిద్ధి మహా గణపతి భారీ విగ్రహం ఆగమన వేడుకను మంత్రి సవిత ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఖైరతాబాద్ వినాయకఉత్సవాలకు మాదిరిగా డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏపీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి ఎస్.సవిత కొనియాడారు.

సంప్రదాయాలను పాటిస్తూ, పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా ఆరేళ్ల నుంచి 72అడుగుల భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తూ వస్తున్న డూండీ గణేశ్ సేవాసమితి సభ్యులను అభినందించారు. ప్రజలంతా మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరవాత ఆరేళ్ల నుంచి భారీ ఎత్తున వినాయక నవరాత్రి ఉత్సవాలను డూండీ గణేశ్ సేవా సమితి నిర్వహిస్తూ వస్తోందన్నారు.

ఏపీలో చిరు వ్యాపారులకు సువర్ణావకాశం.. వారికి క్రెడిట్ కార్డులు!
ఏపీలో చిరు వ్యాపారులకు సువర్ణావకాశం.. వారికి క్రెడిట్ కార్డులు!

ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలను ధీటుగా విజయవాడలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత... డూండీ గణేశ్ సేవా సమితి మహిళా ప్రతినిధులతో కలిసి కోలాటం ఆడి సందడి చేశారు. సంప్రదాయ నృత్యకళాకారిణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కార్పొరేషన్ చైర్మన్లు డూండీ రాకేశ్, పేరేపీ ఈశ్వరరావు, సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+