తెలుగు రాష్ట్రాల్లో ఆగని వరకట్న వేధింపులు ... ఏసీబీ అధికారిణికీ తప్పని తిప్పలు

తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న తనను అదనపు కట్నం కోసం వేదింపులకు గురి చేస్తున్నారని, తన పిల్లలను కూడా తనకు ఇవ్వకుండా వేధిస్తున్నారని రిటైర్డ్ చీఫ్ జడ్జ్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ పిల్లల కోసం పోరాటం చేస్తే , తాజాగా ఏసీబీ అధికారిణి పి.ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.

అవినీతి నిరోధకశాఖ ఉద్యోగినిని ఆమె భర్త అదనపు కట్నం కోసం వేధించటం , ప్రేమవివాహం చేసుకొని ఆరునెలలు గడవక ముందే మరింత కట్నం కావాలంటూ హింసించడంతో ఏపీలోని ఏసీబీ అధికారిణి పోలీసులను ఆశ్రయించారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు తులసీనగర్‌కు చెందిన ఏసీబీ అధికారిణి పి. ప్రభావతి గత ఏడాది నవంబర్‌లో శంకరశెట్టి కిరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కొద్ది రోజులు బాగానే ఉన్న అతను ఆ తర్వాత రూ.20 లక్షలు కట్నం కావాలని వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

 Dowry harrasments in telugu states..another Dowry harassment on ACB official .. case filed

వరకట్న వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ప్రభావతి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఆమె తన భర్త వేధింపులతో మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభావతి భర్త కిరణ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+