డ్రగ్ రాకెట్ రాకెట్ పట్టివేత: దావూద్ గ్యాంగ్‌తో లింక్స్?

డ్రగ్ రాకెట్‌కు చెందిన అజీజ్‌తో పాటు మురళీ, కమ్మ శ్రీను, రాజు, శివ, లక్కీసింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 15 లక్షలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. హవాలా పద్ధతిలో చెల్లింపులు ఉండేవని పోలీసులు కనుగొన్నారు. వారంతా చెన్నైకి చెందినవారని అంటున్నారు.
డ్రగ్స్ ముఠాను అజీజ్ ముఠాగా పిలుస్తున్నారు. వారికి దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధాలు ఉండవచ్చునని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. జీడిమెట్లలోని బాలాజీ లాబ్స్‌లో డ్రగ్ తయారు చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్‌ను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తారా? ఎవరెవరితో సబంధాలు ఉన్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications