ముట్టుకుంటే షాక్ కొట్టేలా మునక్కాయల ధరలు .. కిలో ఎంతో తెలుస్తే ఖంగుతింటారు!!
కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితికి కూరగాయల ధరలు చేరుకున్నాయి. అహ నా పెళ్ళంట సినిమాలో కోడిని వేలాడ కట్టుకుని, దానిని చూసి తిన్నట్టు తృప్తి పడినట్టు ఇప్పుడు కూరగాయలను కూడా వేలాడ కట్టుకొని వాటిని చూసి తృప్తి పడాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు. విపరీతంగా పెరిగిన కూరగాయల ధరలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కానీ పట్టించుకునే నాధుడు లేడని లబోదిబోమంటున్నారు.

టమాటా మాత్రమే కాదు మండిపోతున్న కూరగాయాల ధరలు, మునక్కాయ ధరల షాక్
నిన్నమొన్నటి వరకు కిలో టమాట 100 రూపాయల ధర పెరగగా, బెండకాయ వంకాయ వంటి కూరగాయల ధర కూడా అటు ఇటుగా 100 రూపాయలకు చేరుకుంది. ఇక తాజాగా మునక్కాయ ధరలు కూడా ముట్టుకొంటే షాక్ కొట్టేలా తయారయ్యాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో కిలో మునక్కాయ ఏకంగా ఆరు వందల రూపాయల ధర పలికింది అంటే ప్రస్తుతం మునక్కాయలకు ఉన్న డిమాండ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఒక కిలోకు దాదాపుగా సైజును బట్టి 12 నుంచి 18 ములక్కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క మునక్కాయ ధర 30 రూపాయలు పలుకుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా మునక్కాయ ధర కూడా భారీగా పెరగడంతో జనాలు మునక్కాయల వైపు చూడాలంటేనే భయపడుతున్నారు.

వర్షాలు, వరదల ఎఫెక్ట్ .. భారీగా పెరిగిన కూరగాయల ధరలు
గత నెలలో చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా మేరకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు వివిధ రాష్ట్రాలలో కూరగాయల సాగు వర్షాలు, వరదల కారణంగా దెబ్బతింది. ఈ క్రమంలో కూరగాయల సరఫరా పెద్దగా లేకపోవడంతో కూరగాయలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలోనే ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఏ కూరగాయ ముట్టుకున్నా సామాన్యులు కొనలేని పరిస్థితి కనిపిస్తుంది. వంద రూపాయలు పట్టుకుంటే ఒక పూట కూరగాయలు రాని స్థితి నెలకొంది.

చిత్తూరు జిల్లాలో దెబ్బతిన్న మునగ సాగు.. మదనపల్లె మార్కెట్ లో మండిపోతున్న మునక్కాయలు
చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునగ సాగు తీవ్రంగా దెబ్బతింది. ఇక తమిళనాడు రాష్ట్రం నుండి మదనపల్లె మార్కెట్కు మునక్కాయలు దిగుమతి అవుతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా అయితే ఒక్కొక్క మునక్కాయ ధర పది రూపాయల నుండి 15 రూపాయల వరకు ఉంటుంది. కిలోకు ఎంత లేదన్నా 15 మునక్కాయలు వరకు తూగుతాయి.
ఈ లెక్కన చూస్తే 150 రూపాయలు కిలో మునక్కాయ ధర ఉండాల్సిన చోట, ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు పెరిగి కిలో ఆరు వందల రూపాయలకు మునక్కాయ ధర చేరుకుంది. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో మునక్కాయల ధర ఒక్కొక్క మునక్కాయ 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పలుకుతుంది. దీంతో సామాన్యులు ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ఉన్న మునక్కాయలను తినాలి అంటేనే భయపడుతున్నారు.
Recommended Video

సాంబార్ ప్రియులకు పెద్ద షాక్.. కొంతకాలం మునక్కాయలను మర్చిపోవాల్సిందే
చాలామంది సాంబారులో మునక్కాయ లను బాగా ఇష్టపడతారు. మునక్కాయ లేకుండా సాంబార్ తయారు చేయాలంటేనే ఇబ్బంది పడతారు. ఇక అలాంటి వారికి తాజాగా మునక్కాయ ధర విపరీతంగా పెరిగిపోవడం ఒకింత షాక్ అనే చెప్పాలి. ఇంతగా కొండెక్కి కూర్చున్న మునక్కాయల ధర ఎప్పటికి కొండ దిగుతూ ఉందో తెలియదు కానీ సామాన్యులు మాత్రం కూరగాయల మార్కెట్ లోకి వెళ్ళిన మునక్కాయ లను చూసి మెదలకుండా వచ్చేస్తున్నారు.
ఇంత కాస్ట్ లో కూరగాయలు తాము తినలేమని లోలోపల మధనపడు తున్నారు. కొంతకాలం మునక్కాయలను మర్చిపోవాల్సిందే అని తెగ బాధ పడుతున్నారు.












Click it and Unblock the Notifications