మహిళ మద్యం తాగేసి మత్తులో భర్తను చంపింది

నాచారం, మల్సీస్‌గూడకు చెందిన వరికుప్పల నర్సింహ (55), రాములమ్మ దంపతులు తుర్కయంజాల్, ఏవీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నర్సింహ తుర్కయాంజాల్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తుంటాడు. మద్యం తాగొచ్చి రోజూ కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. శనివారం పూటుగా మద్యం తాగి రోడ్డుపై పడిపోయాడు. కుమారుడు అతడిని ఇంటికి తీసుకువెళ్ళగా మద్యం మత్తులో భార్యను దుర్భాషలాడాడు.
ఆ సమయంలో రాములమ్మ కూడా మద్యం మత్తులో ఉంది. కోపంతో ఆమె కర్రతో భర్తను బలంగా కొట్టి కుమారుడితో కలిసి బంధించింది. తెల్లవారే సరికి నర్సింహ మృతిచెందాడు. రాములమ్మ కర్రతో కొట్టడం వల్లే నర్సింహ మృతిచెందాడని అతడి పెద్ద భార్య కుమారుడు ఆరోపించాడు.
వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 16 ఏళ్ల తిరుమలేష్ తప్ప మిగతా వారికి పెళ్లిళ్లు జరిగాయి. విడిగా ఉంటున్నారు. తల్లిదండ్రులు మద్యానికి బానిసలు కావడంతో తిరుమలేష్ భవన నిర్మాణ రంగంలో కూలిగా పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications