కెసిఆర్‌కు గౌరవం, కిరణే లెక్క చేయట్లేదు: డిఎస్ వ్యాఖ్య

హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అంటే గౌరవమని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆమెను లెక్క చేయడం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్ ఆదివారం అన్నారు.

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం విభజనపై పడదన్నారు. యూపిఏ 2 ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పడిపోదాన్నారు. సోనియా, ప్రధానమమంత్రి మన్మోహన్ సింగ్‌లను కిరణ్ లెక్క చేయడం లేదని మండిపడ్డారు. కిరణ్ తన పదవికి రాజీనామా చేసి అధిష్టానాన్ని ధిక్కరించాలన్నారు.

 DS praises KCR and lashes out at Kiran

కిరణ్ ముఖ్యమంత్రి కాకముందే రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందన్నారు. కెసిఆర్‌కు సోనియా అంటే గౌరవమని, కాంగ్రెసు పార్టీకి ఆయన చాలా దగ్గరివారన్నారు. సీమాంధ్ర ప్యాకేజీ కోసం అక్కడి నేతలు దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సీమాంధ్రులకు కలిగే లాభం ఏమిటో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు చెప్పాలన్నారు.

కిరణ్ తీరు సరికాదు: పొన్నం

శాసన సభలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం చాలా బాధాకరమని కరీంనగర్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆదివారం అన్నారు. రాజ్యాంగం పైన ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో కిరణ్ మూర్ఖంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు.

తిరగబడాలని నిర్ణయించుకున్నాం: హర్ష కుమార్

కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం తమను తీవ్రంగా బాధించిందని, తాము అధిష్టానం పైన తిరగబడాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, అమలాపురం పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ వేరుగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+