ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దసరాకు భారీగా స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే..!
దసరా, దీపావళి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అవుతుంది. ఏపీ నుంచి ఏటేటా వేలాది మంది ప్రజలు ఉపాధి, ఉద్యోగాలు, చదువులు అంటూ హైదరాబాద్ వస్తుంటారు. పండగలకు వీళ్లంతా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో భాగ్యనగరం నిర్మానుష్యంగా మారుతుంది. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో ఫుల్ గా రద్దీ ఉంటుంది. అయితే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ దసరా పండుగకు భారీగా స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. చర్లపల్లి నుంచి అనకాపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించుకున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
దసరా, దీపావళి పండగ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఏపీకు వెళ్లేవారి కోసం భారీగా స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది రైల్వే శాఖ. ఈ దసరా స్పెషల్ రైళ్లు చర్లపల్లి నుంచి అనకాపల్లి మధ్య నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 8 స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ స్పెషల్ రైళ్లు చర్లపల్లి నుంచి ప్రారంభమై అనకాపల్లి చేరుకుని.. మళ్లీ అక్కడి నుంచి తిరిగి చర్లపల్లి స్టేషన్ కు వస్తాయన్నారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు ఓ ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఇక ఈ రైళ్ల పూర్తి సమాచారం చూస్తే.. చర్లపల్లి టూ అనకాపల్లి ట్రైన్ (07035) సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4 ప్రతి శనివారం ఉంటుంది. మళ్లీ అనకాపల్లి టూ చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఉంటుంది. ఈ స్పెషల్ సర్వీసులను ప్రజలు వినియోగించుకోవాలని రద్దీ లేని ప్రయాణం చేయాలని సూచించారు. ఇక చర్లపల్లి నుంచి బయల్దేరే ట్రైన్.. ఏ ఏ స్టేషన్లలో ఆగుతుందో చూస్తే.. జనగామ, కాజీపేట, వరంగల్ మీదుగా.. మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా ఏపీలోకి ప్రవేశించనుంది.

అక్కడి నుంచి రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్ల మీదుగా నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి రైల్వే స్టేషన్లలో స్టాప్ ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. బెర్తుల వివరాలు చూస్తే.. ఈ స్పెషల్ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటుగా స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు కూడా ఉంటాయని తెలిపారు. వీటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఇక పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లేవారి సౌకర్యార్థం మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్టు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. మధురై-బరౌని మధ్య 12, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- బరౌని మధ్య 12, షాలిమార్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య 10 రైళ్లు నడుస్తాయని వివరించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications