భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ చూపిస్తా: పవన్ కళ్యాణ్; వెంట్రుక కూడా పీకలేరు: ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విప్పటం సభలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆయనకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. దానికి కాకినాడ ఎమ్మెల్యే చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు.

సభలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్
జనసేన సభలో వైసిపి అగ్రనేత వై.వి.సుబ్బారెడ్డి గారికి ఓ విషయం చెప్పదలుచుకున్నాను అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి అకారణంగా తనను పచ్చి బూతులు తిట్టాడని, అనకూడని మాటలు అన్నాడని అయినా తాను సహించాను అని పేర్కొన్నారు. అయితే జనసేన నాయకులకు కోపం వచ్చి ఎందుకు ఇలా అన్నావ్ అంటూ నిలదీయడానికి వెళితే వారిపై దాడులు చేశారని, జనసేన వీర మహిళలను నోటికొచ్చినట్టు మాట్లాడారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ చూపిస్తానని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
దీంతో తాను తనను అన్న దాని కన్నా అయ్యో వీళ్ళని ఎందుకు రాజకీయాల్లోకి దించానని బాధపడ్డానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో వై వి సుబ్బారెడ్డి గారు మీరు పెద్దవాళ్ళు , విజ్ఞులు, ఇంత గడ్డి పెట్టండి అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది. భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే వ్యవహరిస్తే భీమ్లానాయక్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూపిస్తానంటూ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ద్వారంపూడి
ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతే స్థాయిలో రివర్స్ ఎటాక్ ఇచ్చారు. నిన్న ఇప్పటం లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పార్టీ ప్రమోషన్ కోసం చేసినట్లుగా లేదని, పార్టీకి రేటు పెంచుకునేందుకు పెట్టిన సభలా ఉందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. తెలిసీ తెలియక కొంత మంది నాయకులు అమాయకంగా జనసేన పార్టీలో చేరుతున్నారని, వారందరినీ పవన్ కళ్యాణ్ పొత్తుల ద్వారా ముంచుతున్నాడని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.

పవన్ సినిమాల్లో హీరో కావచ్చు.. జగన్ రియల్ హీరో: ద్వారంపూడి
పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. పొత్తుల కోసం పవన్ కళ్యాణ్ ఎత్తులు వేస్తున్నారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇంత మంది బలం ఉంది అని చెప్పుకోవడం కోసమే పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పబ్లిక్ గా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు.
Recommended Video

కాకినాడలో ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరు: ద్వారంపూడి
తాను అంత శాంతపరుడిని కాదని పేర్కొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన జోలికి వస్తే ఎవరిని క్షమించనని తేల్చిచెప్పారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా టీడీపీ, బీజేపీ చంక ఎక్కడం మానుకోవాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. జనసేన కార్యకర్తలు తన ఇంటి పై దాడి చేయడం వల్లే తన అనుయాయులు ప్రతి దాడి చేశారని పేర్కొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో తన వెంట్రుకను కూడా పీకే వారే లేరని సవాల్ విసిరారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications