క్షమించండి - ఈవో, ఏఈవో బాధ్యులు: పవన్ కీలక డిమాండ్..!!

తిరుపతి ఘటన పైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగిందని.. బాధ్యత తీసుకుంటూ.. ప్రభుత్వం నుంచి క్షమాపణలు కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. టీటీడీ అధికారులు బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో ఇలా జరగటం బాధ కలిగించిందని చెప్పారు. ఈవో శ్యామల రావు.. ఏఈవో వెంకన్న చౌదరి మధ్య గ్యాప్ ఉందని.. ఈ ఘటనకు వారే బాధ్యలని పవన్ వ్యాఖ్యానించారు. బోర్డు ఛైర్మన్ తో సహా సభ్యులు మరణించిన వారికి బోర్డు సభ్యులు మద్దతుగా నిలవాలని పవన్ డిమాండ్ చేసారు.

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. స్విమ్స్ లో చికిత్స పొందుతు న్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత టీటీడీ ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. పోలీసులు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారని మండి పడ్డారు. పోలీసులకు ఎలా వ్యవహరించాలో తెలియటం లేదని మండిపడ్డారు. టీటీడీలో ప్రక్షాళన జరగాలని పవన్ అభిప్రాయపడ్డారు. టీటీడీ ఈవో, ఏఈవోకు గ్యాప్ ఉందని పవన్ చెప్పుకొచ్చారు. పోలీసుల్లో కొందరు కావాలనే వ్యవహరించారని తనకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.

Dy CM Pawan Kalyan serious on TTD officials over Tirupati Stampede Asks apology

ఈ సమయంలో అభిమానులు, పోలీసులపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ సీరియస్ అయ్యారు. ఇంతమంది అధికారులు న్నా ఆరుగురి ప్రాణం పోవడం సరికాదని చెప్పుకొచ్చారు. తొక్కిసలాట జరిగినా ఇప్పుడు కూడా పోలీసులు జనాలను కంట్రోల్‌ చేయలేరా అని ప్రశ్నించారు. ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలం అయ్యారని పవన్ మండి పడ్డారు. పోయిన ప్రాణాలు తీసుకురాలేమని.. కానీ, తప్పు జరిగిందని.. తాను తప్పించుకోవటం లేదని.. భక్తులు క్షమించాలని పవన్ అభ్యర్ధించారు. అదే విధంగా మరణించిన ప్రతీ ఒక్కరి కుటుంబానికి టీటీడీ బోర్డు సభ్యులు అండగా నిలవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+