అల్లర్లు సంభవించిన నరసరావుపేటపై ఈసీ ప్రకటన: గెలుపెవరిదో క్లారిటీ వచ్చినట్టే
Narasaraopet: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ధీమాగా ఉంటోన్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటోన్నారు.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

పోలింగ్ రోజు, ఆ తరువాతా అల్లర్లు, దాడులు- ప్రతిదాడులతో నరసరావుపేట అట్టుడికిపోయిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం వెలుగులోకి వచ్చాకా.. నరసరావుపేట పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలను ఆయన ధ్వంసం చేయడం కలకలం రేపింది.
కాగా.. నరసరావుపేట లోక్‌సభ, దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మేర పోలింగ్ శాతం నమోదైందనేది ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఈ హింసాత్మక పరిస్థితుల వల్లే ఆ డేటాను ఎన్నికల అధికారులు సకాలంలో క్రోడీకరించలేకపోయారు. అందుకే తీవ్ర జాప్యం నెలకొందీ విషయంలో.
ఇప్పుడు తాజాగా అక్కడ ఎంత శాతం మేర పోలింగ్ నమోదైందనే విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేశారు. నరసరావుపేట లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 13వ తేదీన జరిగిన ఓటింగ్ సందర్భంగా నరసరావుపేటలో 85.65 శాతం మేర పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్ల సంఖ్య 17,34,858 కాగా.. 14,85,909 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళల శాతమే అధికంగా నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొత్తం 85.94 శాతం మేర మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల పోలింగ్ శాతం 85.37గా నమోదైంది. 46.07 శాతం ట్రాన్స్‌జెండర్లు ఓటు వేశారు. వినుకొండలో అత్యధికం, నరసరావుపేట అసెంబ్లీలో అత్యల్పంగా పోలింగ్ శాతం రికార్డయినట్లు ఈసీ తెలిపింది.
వినుకొండ- 89.22, పెదకూరపాడు- 89.18, సత్తెనపల్లి- 86.97, చిలకలూరిపేట- 85.00, గురజాల- 84.30, మాచర్ల- 83.75, నరసరావుపేట- 81.06 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇక్కడ విజయం తమదంటే తమదేనంటూ వైఎస్ఆర్సీపీ, టీడీపీ చెప్పుకొంటోన్నాయి. ఆయా పార్టీల్లో ఎవరు గెలుస్తారనేది మహిళల ఓట్లు తేల్చేయనున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications