Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాయిరెడ్డికే తిరిగి రాజ్యసభ- ఢిల్లీలో కీలక పరిణామాలు...!?

ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. వైసీపీ ఎంపీగా సాయిరెడ్డి రాజీనామా తో ఈ ఉప ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో ఈ స్థానం కూటమి కే దక్కనుంది. సాయిరెడ్డి రాజీనామా వెంటనే ఈ స్థానం పైన ఢిల్లీ నేతలు స్పష్టత ఇచ్చారు. ఏపీలో కూటమిలోనే కొనసాగుతూనే బీజేపీ పట్టు పెంచుకుంటోంది. సాయిరెడ్డి విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక వేళ బీజేపీ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.

ఈసీ షెడ్యూల్
ఏపీ నుంచి కూటమి మరో రాజ్యసభ స్థానం దక్కించుకోనుంది. వైసీపీ నేత సాయిరెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ కానుంది. 29వ తేదీ వరకు నామినేషన్లకు చివరి గడువు. వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఏకగ్రీవంగానే ఎన్డీఏ సీటు గెలుచుకోనుంది. కాగా, కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే కొత్త అభ్యర్ధి ఎవరు. రాజ్యసభ విషయంలో మాత్రం బీజేపీ పట్టు బిగించింది. ఏపీ విషయంలో తాము పట్టువిడుపులతో ఉంటామని.. పార్లమెంట్ అంశంలో మాత్రం తమ పార్టీకే ప్రాధాన్యత ఉండాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే గతంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. తొలుత మూడు పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించినా.. చివరకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్ధనతో పవన్ తన సోదరుడు సీటును త్యాగం చేసారు.

ec-releases-schedule-for-bye-election-to-rajyasbaha-from-andhra-pradesh

సాయిరెడ్డి స్థానంలో
బీజేపీ ఖాతాలో ఇప్పుడు విజయ సాయిరెడ్డి రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూటమికి దక్కనుంది. అయితే, ఈ సీటు మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకే అనే అంచనాతో ఉన్నారు. కానీ, సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్ర బాబు, పవన్ కు స్పష్టం చేసి నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి వస్తోంది. వైసీపీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమి లో చేరారు. తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకే కేటాయించారు. ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన సాయిరెడ్డి రాజీనామాతో అదే వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. కొత్త అభ్యర్ధి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. సీమ ప్రాంతానికే బీజేపీ ఈ సీటు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. బీసీ వర్గానికి చెందిన ఆర్ క్రిష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపినా.. తెలంగాణ లో ఆయన సేవలు వినియోగించుకోనుంది.

Take a Poll

బీజేపీ అభ్యర్దిగా
అదే విధంగా ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో బీజేపీ నుంచి ముగ్గురి పేర్లు బలంగా ప్రచారంలో ఉన్నాయి. అందులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు తో పాటుగా ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో సాయిరెడ్డి సైతం బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ఆ పార్టీ నేతల సమాచారం. సాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు టీడీపీ నుంచి అభ్యంతరం వస్తుండటంతో ఆయన చేరిక ప్రక్రియ ఆలస్యం అయిందని చెబుతున్నారు. లిక్కర్ కేసులో సాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, ఈ సారికి సాయిరెడ్డి ఛాన్స్ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీటు బీజేపీకే ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఏపీ నేతలకే అవకాశం ఇస్తారా.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా అనూహ్యంగా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+