ఎన్నికల సమరం, షెడ్యూల్ ప్రకటన - గెలుపెవరిది..!!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఏపీలో రెండు గ్రాడ్యేయేట్లు..ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో సైతం రెండు ఉపాధ్యా య - ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారు అయ్యాయి. దీంతో, వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలో కసరత్తు ముమ్మరం చేసాయి.
షెడ్యూల్
ఏపీలో గోదావరి జిల్లాలతో పాటుగా, గుంటూరు - క్రిష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు.. అదే విధంగా శ్రీకాకుళం- విజయనగరం- విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ నున్నాయి. ఇక, తెలంగాణలో మెదక్ - నిజామాబాద్ - అదిలాబాద్ - కరీంనగర్ గ్రాడ్యుయేట్, మెదక్- అదిలాబాద్ - నిజామాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

కసరత్తు
ఈ ఎన్నికలకుఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
కాగా, ఇప్పటికే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీలు తమ అభ్యర్దులను ఖరారు చేసారు. ఏపీలో టీడీపీ తమ అభ్యర్దులను ప్రకటించింది. ఇప్పటికే ప్రచారంలో అభ్యర్దులు బిజీ అయ్యారు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఎన్నిక ద్వారా ప్రజల మూడ్ ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఈ స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేసాయి.












Click it and Unblock the Notifications