ఈసీ వర్సెస్ వైసీపీ: ఈసీ నిర్ణయాల వెనుక కుట్ర: సజ్జల సంచలన వ్యాఖ్యలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇదే సమయంలో షెడ్యూల్ వచ్చిన నాటినుండి నేటి వరకు వైసిపి ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న ఏపీలో ఉన్నతాధికారులను బదిలీ చేయడం వైసిపికి ఒకరకంగా మింగుడు పడని అంశం.

ఈసీ తీరుపై వైసీపీ ఆగ్రహం
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఈసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది వైసిపి. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు నిలుపుదల చెయ్యమని ఈసీ ఆదేశించింది. దీంతో వైసీపీ నేతలు ఎన్నికల కమీషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

EC vs YSRCP Conspiracy behind EC decisions in ap Sajjala ramakrishna reddy sensation

ఈసీ నిర్ణయాల వెనుక కుట్ర
తాజాగా ఈ విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఎన్నికల కమీషన్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్ కు ఈసీ అనుమతి ఇచ్చిందని, ఏపీలో మాత్రం ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత వివక్ష చూపుతోందని ప్రశ్నించారు. ఈసీ నిర్ణయాల వెనుక కుట్ర ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

ఏపీలో రైతులకు, విద్యార్థులకు నిధులు అందకుండా నిలిపివేత నిర్ణయం
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సంక్షేమ పథకాల నిధులు విడుదలకు ఈసీ నో చెప్పిందని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఇక ఆసరా కూడా అందరికీ అందలేదని అన్నారు. ఈ సమయంలో ఏపీలో విద్యార్థులకు, రైతులకు సకాలంలో పథకాలు అందకుండా నిలిపి వేస్తున్నారని, ఇవన్నీ రెగ్యులర్ గా ఇచ్చే పథకాలేనని పేర్కొన్నారు.

తెలంగాణాకు ఒక న్యాయం.. ఏపీకి మరో న్యాయమా?
తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయం ఏపీకి మరో న్యాయమా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కూటమి నేతల ఒత్తిడితోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు . ఇవి కొత్తగా పెట్టిన పథకాలు కాదని, రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అమలులో ఉన్న పథకాలని, వాటిని ఇప్పుడు సడన్ గా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిలుపుదల చేయాలన్న ఈసీ ఆదేశం విస్మయాన్ని కలిగిస్తుంది అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+