వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవర్ గ్రీన్ కాంబో: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ, రోజా

|
Google Oneindia TeluguNews

ముస్లిం సోదరులకు నందమూరి బాలకృష్ణ, రోజా పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, సేవా నిరతికి రంజాన్ పండుగ మారుపేరని పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఉంటూ ముస్లిం సోదరులు తమ ఇష్టదైవాన్ని కొలవడం ఆదర్శప్రాయమని చెప్పారు. అల్లా కృపా కటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం.. ప్రతి ఒక్కరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని బాలకృష్ణ అకాంక్షించారు. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని అన్నారు. అత్యంత కఠోరమైన ఉపవాస దీక్షలను నెలరోజుల పాటు పాటించడం ఇస్లాం గొప్పదనాన్ని చాటుతోందని చెప్పారు.

క్రమశిక్షణ, దాతృత్వం, దివ్య చింతనల కలయికే రంజాన్‌గా రోజా అభివర్ణించారు. దివ్య ఖురాన్ అవతరించిన ఈ శుభ సందర్భాన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. అల్లా దీవెనలతో దేశం కరోనా మహమ్మారి బారి నుంచి త్వరలో విముక్తి పొందుతుందనే ఆశాభావాన్ని రోజా వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ పుణ్యమాసంలో అత్యంత నిష్ఠ ఉపవాస దీక్షను ముగించుకుని,ఈ రోజు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ చెప్పారామె.

Eid Mubarak: MLAs Balakrishna and Roja wishes to Muslims on the occasion of Ramadan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ సహా అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం మనిషిలోని బలహీనతలు, స్వార్థ భావాలను తుడిచిపెట్టేదిగా నారా లోకేష్ పేర్కొన్నారు. వాటి స్థానంలో క్రమశిక్షణ, సేవాగుణం, సోదర భావాలను పెంపొందించేదే రంజాన్ ఉపవాస దీక్షా మాసమని అన్నారు. పవిత్ర మాస దీక్షలను ముగించుకుని ఈ రోజు పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Tollywood actors and YSRCP and TDP MLAs RK Roja and Nandamuri Balakrishna wish muslims on the occasion of Ramadan. Balakrishna expressed his gratitude to Muslims for praying for all community
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X