పవన్ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: జనసేనకు కామన్ సింబల్‌గా ‘గ్లాస్’ కేటాయింపు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాన్‌కు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. జనసేన పార్టీకి కామన్ సింబల్ 'గ్లాసు' గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, గతంలో గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పేర్కొన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరోవైపు, మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో 'టార్చ్‌లైట్ ' గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార జోరును పెంచింది. అధికార వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతూనే తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చెబుతు్నారు. తమ కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రతీ చేతికి పని, ప్రతీ చేనుకు నీరని పవన్ వ్యాఖ్యానించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పవన్ చెప్పారు.
కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని భరోసానిచ్చారు పవన్. నదులు అనుసంధానం చేసి ప్రతీ చేనుకు నీరందిస్తామనన్నారు. రైతు కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. పెద్దాపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ నాయకులు దోచేశారని పవన్ ధ్వజమెత్తారు. మట్టి, గ్రావెల్, ఇసుక తవ్వకాలతో ప్రకృతి వనరులను నాశనం చేశారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ అరాచకాలను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని పవన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమి పవన్ హెచ్చరించారు. రాష్ట్రభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని పవన్ చెప్పారు.












Click it and Unblock the Notifications