AP Elections 2024: ఈసారి ఏపీలో ఈసీ పోలింగ్ టార్గెట్ ఎంతో తెలుసా ?

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు గడువు సమీపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా పోలింగ్ కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు రూపొందించడంతో పాటు సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటోంది.

ఈసారి ఏపీ ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ మేరకు పోలింగ్ నమోదు కాకపోవడంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ఓటర్లతో పాటు పోలింగ్ కు దూరంగా ఉండిపోతున్న మధ్యతరగతి, ఇతర వర్గాల్ని కూడా పోలింగ బూత్ లకు రప్పించేందుకు ప్రయత్నిస్తుున్నట్లు సీఈవో వెల్లడించారు.

election commission put 83 percent polling target for ap elections

రాష్ట్రంలో రూరల్ ప్రాంతాలతో పోలిస్తే అర్బన్ ప్రాంతాల్లోనే పోలింగ్ శాతాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇక్కడ ఎక్కువగా ఉండే విద్యార్దులు, పరిశ్రమల్లో కార్మికులు, ఎగువ మధ్యతరగతి ప్రజల్ని ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాముల్న చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఈవో ముకేష్ మీనా తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మే 13న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+