అమరావతి మెడలో మరో మణిహారం: త్వరలో ఎనర్జీ యూనివర్సిటీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విద్యుత్ రంగం చాలా ముఖ్యమైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సోలార్‌ విండ్‌ డెవలపర్స్‌ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, విద్యుదుత్పత్తికి ఇతర ప్రత్యామ్నాయాలపై నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో విద్యుత్ సరఫరా చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడుతున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం రూ. 21 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

 Energy University will setup in Ap capital Amaravati

ఇక ఈ సదస్సులో పాల్గొన్న సుజలాన్ పవర్‌ కార్పొరేషన్‌ నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఎనర్జీ యూనివర్సిటీని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఎనర్జీ యూనివర్సిటీ కోసం రూ. 35 కోట్లను సుజలాన్ పవర్‌ కార్పొరేషన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసింది.

ఎనర్జీ యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు రూ.50కోట్లు ప్రకటించారు. ఎనర్జీ యూనివర్సిటీ కోసం రూ. 50 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాని కోరతామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+