జగన్ ను జనవరి మూడవవారంలో ఈడీ ప్రశ్నించే అవకాశం

వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ ను జనవరి మూడవ వారంలో ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనపై ఉన్న కేసుల విషయంలో ఈడీ ఆయనను ప్రశ్నించనుంది.

విజయవాడ :ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) జనవరి మొదటివారంలో వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ నెల 20 నుండి 23 తేదిల్లో జగన్ ఈడీ అధికారులు ప్రశ్నించేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కేంద్రంలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వంలో టిడిపి కూడ భాగస్వామిగా ఉంది. కేంద్రంలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నర ఏళ్ళు అవుతోంది.అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్న వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ కేసుల విషయంలో కేంద్రం నెమ్మదిగా వ్యవహరిస్తోందనే ఆలోచనలో టిడిపి ఉంది.

enforcement director may quiz ys jagan mohan reddy in january third week

జగన్ కేసుల విషయంలో ఈడీ నెమ్మదిగా అడుగులు వేస్తోందనే అభిప్రాయాన్ని టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయతే ఈ కేసులకు సంబందించిన ఆదారాలను ఈడీ ప్రతి రోజు సేకరిస్తోంది. పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించిన తర్వాతే జగన్ ను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం .

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ బలపడితే రాజకీయంగా టిడిపి, బిజెపిలకు నష్టమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు టిడిపి నాయకులు . ఇదే అభిప్రాయాన్ని టిడిపి నాయకులు కొందరు కేంద్రమంతుల దృస్టికి తెచ్చారు. వైఎస్ ఆర్ సి పి బలపడితే 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు ఓటమి పాలుకావడం ఖాయమనే సంకేతాలను ఇచ్చారు పార్టీ నాయకులు .

దరిమిలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా జగన్ కేసుల విషయాన్ని త్వరితగతిన పరిష్కరిస్తే రాజకీయంగా ఆ పార్టీని నష్టపరిచే అవకాశం ఉందని టిడిపి నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.

బిజెపి నాయకులు కూడ వైఎస్ఆర్ సి పి నాయకుడు జగన్ పట్ల సానుకూలమైన దృక్పథంలో లేరు. పెద్ద నగదు నోట్ల రద్దుతో పాటు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ పట్ల జగన్ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ నిర్ణయాలు కూడ బిజెపి నాయకులు ఆయనపై సానుకూలమైన దృక్పథంతో లేరని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+