TTD: బ్రహ్మోత్సవాల్లో ఆ రోజు ప్రత్యేకం - దర్శనంపై ఈవో కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహనసేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమలలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు స్వీకరించబోమనని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. రెండు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారని వివరించారు. ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి జగన్రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని తెలియజేశారు. బయట వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని, అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం, బస, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం, బస, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు. భద్రతాచర్యలపై ఇదివరకే సివిఎస్వో, తిరుపతి ఎస్పీ సమీక్ష నిర్వహించారని, ఇంజినీరింగ్ అధికారులు వీరికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుండి వాహన మండపం, మాడ వీధులు, బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, సుపథం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 తదితర ప్రాంతాలను ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications