బాబు వల్లే కేటీఆర్ అమెరికాకు, ఇదీ చరిత్ర!: కేసీఆర్‌ను దులిపిన ఎర్రబెల్లి, ఎన్టీఆర్ భవన్ వద్ద టెన్షన్

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం నాడు సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల దుమ్ము దిలిపారు. వెయ్యిమంది విద్యార్థుల చావుకు కారణం కేసీఆర్ అని ధ్వజమెత్తారు.

దళితుడిని సీఎం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆయన పీఠం ఎక్కారన్నారు. దళితుడిని సీఎం చేస్తానంటే జనాలు ఓటు వేశారని చెప్పారు. మెడ కోసుకుంటానని ఇచ్చిన వాగ్ధానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఇదీ చరిత్ర!

చంద్రబాబు దయతోనే మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లారని చెప్పారు. ఆలుగడ్డలు అమ్మే తలసానిని ఎమ్మెల్యేని చేసి, మంత్రిగా చేసింది చంద్రబాబే అన్నారు. కూలీ కుటుంబం నుండి వచ్చిన కడియంను మంత్రిగా చేసింది చంద్రబాబే అన్నారు.

కేసీఆర్ భాషతో అసహ్యం

కేసీఆర్ భాషను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. లఫంగి వేషాలు వేస్తోంది కేసీఆరే అన్నారు. పాస్ పోర్టు కేసులో కేసీఆర్ ఇరుక్కుంది నిజం కాదా అని ప్రశ్నించారు. దొంగ దీక్షలతో లఫంగి వేషాలు వేశారన్నారు. కేసీఆర్‌కు ఓయులో అడుగు పెట్టే దమ్ముందా అని సవాల్ చేశారు.

కేసీఆర్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండరని చెప్పారు. ఏసీబీ అధికారులు నిజాయితీగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ద్రోహులకు పదవులు ఇస్తున్న కేసీఆర్ పైన మేధావులు పోరాడాలన్నారు. 63 సీట్లున్న కేసీఆర్ ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టడం లఫంగి పని కాదా అన్నారు.

Errabelli lashes out at KCR, Kadiyam and Talasani

బాబుకు మెంటలెక్కింది: మంత్రి మహేందర్ రెడ్డి

రేవంత్ రెడ్డి వ్యవహారంతో చంద్రబాబుకు మెంటలెక్కిందని తెలంగాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. తాము కళ్లు తెరిస్తే చంద్రబాబు మటాష్ అవుతారని చెప్పారు. తమ పార్టీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదన్నారు.

బాబు బుకాయింపు: మంత్రి లక్ష్మా రెడ్డి

రాజకీయాల్లో డబ్బు సంసృతి తీసుకు వచ్చింది చంద్రబాబేనని మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో తప్పు చేసి బుకాయిస్తుడన్నారు.

భ్రష్టు పట్టిస్తున్నారు: తమ్మినేని

ఇద్దరు చంద్రులు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని లెఫ్ట్ పార్టీ నేత తమ్మినేని మండిపడ్డారు. ఉద్యమం సమయంలో జై కొట్టిన తెలంగాణ ప్రజలే ఇప్పుడు కేసీఆర్‌ను ఛీ అంటున్నారన్నారు. బీడి కార్మికులకు రూ.1000 భృతి ఇవ్వకుంటే బుద్ధి చెబుతారన్నారు.

దిష్టిబొమ్మల దగ్ధానికి యత్నం

ఎన్టీఆర్ భవన్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు తెరాస మహిళా కార్యకర్తలు యత్నించగా టీడీపీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో, ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+