టిడిపిని చూసి టిఆర్‌ఎస్ వణుకుతోంది: ఎర్రబెల్లి, కెసిఆర్‌పై రేవంత్ ఫైర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిఆర్ఎస్‌లో దొంగలు, లఫంగీలు చేరారని, టిడిపిని చూసి టిఆర్‌ఎస్ వణుకుతోందని దయాకర్ అన్నారు.
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో నిర్వహించిన టిడిపి కార్యకర్తల సమావేశంలో నేతలు ఎర్రబెల్లి, రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణకు టిడిపి అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. మార్చి 3న కరీంనగర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

కెసిఆర్‌పై రేవంత్ ఫైర్
అవినీతిపరుల పట్ల హిట్లర్‌ల వ్యవహరిస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పదే పదే చెప్పిన తెలంగాణ సిఎం కెసిఆర్‌కు... మంత్రి హరీష్‌రావు శాఖలో అవినీతి కనిపించడం లేదా? అని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరి కెసిఆర్ (తన అల్లుడు) హరీష్‌రావుపై చర్యలు తీసుకుంటారా? అని ఆయన అడిగారు.
అదే విధంగా విద్యా వ్యవస్థ సక్రమంగా లేదని, అందులో బోగస్ సంస్థలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయమై మంత్రి జగదీష్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయని, 5 శాతం వసూలు చేశారని విమర్శలు వస్తున్నాయని అన్నారు. ఆయనపై విమర్శలు వచ్చినా ప్రమోషన్ ఇచ్చారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సిఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications