తెలంగాణ ద్రోహుల ఫొటోలు, కోదండరామ్ అడగాలి: ఎర్రబెల్లి
మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ బ్యానర్లపై తెలంగాణ అమర వీరుల ఫొటోలు పెట్టకపోవడంపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును అడగాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టిఆర్ఎస్ ప్లీనరీ బ్యానర్లపై తెలంగాణ ద్రోహుల ఫొటోలు పెట్టారని, తెలంగాణ అమరవీరుల ఫొటోలు పెట్టలేదని ఆయన అన్నారు.
మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన గురువారం సాయంత్రం మాట్లాడారు. అంగడిలో పశువుల్లా కెసిఆర్ శాసనసభ్యులను కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తమ పార్టీ ఆవిర్భావం తర్వాతనే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయని మరో తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. పటేల్, పట్వారీల వ్యవస్థను ఎన్టీ రామారావు రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో దొరల పాలన వచ్చిందని, కెసిఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటివ్వలేదని ఆయన విమర్సించారు.
ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగించారు. మరో నేత రేవంత్ రెడ్డి ఈ సభలో కెసిఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications