బాబు పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయింది : జగన్ (ఫోటోలు)

విజయవాడ : చంద్రబాబు పాలనలో గుళ్లు గోపురాలకు, మహాత్ముల విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. గుళ్లు గోపురాలపై ఏమాత్రం విశ్వాసం లేని చంద్రబాబు.. గుడిని, గుడిలో లింగాన్ని అమ్మేసే వ్యక్తి అని ఎద్దేవా చేశారు.

పుష్కర స్నానాల సందర్బంగా.. మృత్యువాత పడ్డ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు నందిగామ వెళ్లిన జగన్ మార్గమధ్యలో ఇబ్రహీంపట్నం వద్ద ఆగారు. ఈ సందర్బంగా.. ఇటీవలే అధికారులు కూల్చివేసి పునర్నిర్మించిన గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జగన్, చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు.

పుష్కరాల కోసం ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ఆహ్వానించి.. ఏర్పాట్లు చాలా గొప్పగా చేస్తున్నామని చెబుతోన్న చంద్రబాబు.. గుళ్లు గోపురాలను మాత్రం విచక్షణా రహితంగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుళ్లను కూల్చేప్పుడు కొన్ని నిబంధనలకు కట్టుబడి ఆ పనులు చేయాలని అవేవి లేకుండా చంద్రబాబు గుళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుడిలో విగ్రహాన్ని ముట్టుకోవాలన్నా ముందుగా దేవాలయ కమిటీతో మాట్లాడాలని, దేవుడిని ఆ స్థానం నుంచి తొలగించేప్పుడు పూజలు చేయాల్సి ఉంటుందని, కానీ చంద్రబాబు పాలనలో ఇవేవీ జరగడం లేదని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పుష్కరాలను రాజకీయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు.

బినామీలకు దోచి పెడుతాన్నరంటూ చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలు స్లైడ్స్ లో :

 బాబు పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయింది : జగన్ (ఫోటోలు)

బాబు పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయింది : జగన్ (ఫోటోలు)

సాక్షాత్తు శివుడి భూములైన సదావర్తి భూములను ముట్టుకోవడానికి ఎవరూ సాహసించరన్న జగన్.. చంద్రబాబు మాత్రం వెయ్యి కోట్ల విలువ చేసే ఆ భూములను కేవలం రూ.22 కోట్లకే బినామీలకు దోచి పెట్టారని ఆరోపించారు.

 బాబు పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయింది : జగన్ (ఫోటోలు)

బాబు పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయింది : జగన్ (ఫోటోలు)

చంద్రబాబు పాలనలో మహాత్మా గాంధీకి, వైఎస్ విగ్రహానికి సెక్యూరిటీ లేకుండా పోయిందన్నారు జగన్. ఇందుకు ఫలితంగా దేవుడే చంద్రబాబుకు మొట్టికాయలు వేసే రోజు వస్తుందని ఆ రోజు రావాలని కోరుకుందామని అన్నారు జగన్.

 బాబు పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయింది : జగన్ (ఫోటోలు)

బాబు పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయింది : జగన్ (ఫోటోలు)

గురువారం నాడు విజయవాడలోని పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించిన జగన్.. అనంతరం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+