సీఎం జగన్‌తో మాజీ కేంద్రమంత్రి సురేశ్ ప్రభు భేటీ, రాజకీయాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు సమావేశమయ్యారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కేంద్రమంత్రి భేటీ అయ్యారు. మధ్యాహ్నాం సురేశ్ ప్రభు దంపతులు లంచ్ కూడా చేశారు. తర్వాత జగన్-సురేశ్ ప్రభు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

ఏపీ రాజకీయాలు, సంక్షేమ పథకాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ప్రధాని మోడీతో సురేశ్ ప్రభుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకోసమే సురేశ్ ప్రభుతో వివిధ అంశాలపై సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.

ex central minister suresh prabhu met ap cm jagan

రాజధానిపై జీఎన్ రావు కమిటీ వేసిన అంశంపై మంత్రివర్గ సమావేశంలో శుక్రవారం చర్చించారు. అయితే సురేశ్ ప్రభు వస్తున్నారని తెలిసి మంత్రివర్గ సమావేశాన్ని త్వరగా ముగించినట్టు తెలుస్తోంది.

ex central minister suresh prabhu met ap cm jagan

సీఎం జగన్‌ను నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ చైర్ పర్సన్ నందకుమార్ సాయి కూడా మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. సీఎం జగన్‌కు పుష్పగుచ్చం అందజేసి, జ్ఞాపికను కూడా బహుకరించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను జగన్.. సాయికి వివరించినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+