మిథున్ రెడ్డిపై పోటీకి మాజీ సీఎం, అక్కడే ట్విస్ట్ - లక్ష్యం నెరవేరేనా..!!

నల్లారి వర్సస్ పెద్దిరెడ్డి. కాంగ్రెస్ లోనే ఉన్నా..ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నా రాజకీయ వైరం మాత్రం తగ్గలేదు. బీజేపీ(BJP)లో ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు. తొలి సారి లోక్ సభ(Loksbaha) బరిలో పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మిథున్ రెడ్డి (mithu Reddy)నియోజకవర్గం పైన గురి పెట్టారు. టీడీపీ, జనసేన పొత్తు వేళ లెక్కలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. రాజంపేట(Rajampeta) లో ఏం జరుగుతోంది.

మారుతున్న లెక్కలు
ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. రానున్న ఎన్నికలు ప్రధాన పార్టీల భవిష్యత్ కు కీలకంగా మారాయి. ప్రతీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కుప్పం లో ఈ సారి చంద్రబాబు(Chandra Babu) టార్గెట్ గా పెద్దిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అటు పెద్దిరెడ్డి(Pedddireddy) ఎలా గెలుస్తారో చూస్తానంటూ చంద్రబాబు సవాల్ చేసారు. ఇదే సమయంలో మాజీ సీఎం కిరణ్(Kiran Kumar Reddy) రంగంలోకి దిగుతున్నారు. గతంలో కాంగ్రెస్ లోనే పని చేసినా..పెద్దిరెడ్డి..నల్లారి మధ్య గ్యాప్ ఉండేది. కిరణ్ కు స్పీకర్ పదవి ఇచ్చి నాడు వైఎస్సార్ పెద్దిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కిరణ్ సీఎం అయిన తరువాత పెద్దిరెడ్డి(Peddireddy)ని తప్పించి..చిత్తూరు నుంచి గల్లా అరుణను కొనసాగించారు.

Kiran Kumar Reddy

పెద్దిరెడ్డి లక్ష్యంగా
ఇక, వైసీపీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ(BJP)లో కొనసాగుతున్నారు. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచి ప్రస్తుతం లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. ఈ సారి రాజంపేట(Rajampet) నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉంటారని చెబుతున్నారు. రాజంపేట లోక్‌సభ పరిథిలో రాజంపేట, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి, రైల్వే కోడూరు, మదనపల్లి, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బీజేపీ నుంచి గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన పురందేశ్వరి పైన మిథున్ రెడ్డి విజయం సాధించారు. అయితే, వైసీపీ(YSRCP) లక్ష్యంగా సాగుతున్న రాజకీయ తంత్రంలో రాజంపేట కేంద్రంగా కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది.

Mithun Reddy

కొత్త సమీకరణాలు
రాజంపేట పరిధిలో ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువ. పార్టీ పరంగా బీజేపీ(BJP)కి వారి నుంచి మద్దతు లేకపోయినా కిరణ్ కు వ్యక్తిగతంగా మద్దతు ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ-జనసేన అభ్యర్ధి బరిలోకి దిగే అవకాశం ఉన్నందున, బలిజ వర్గం ఆ కూటమి వైపే మొగ్గు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. దీని ద్వారా టీడీపీ- జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నా లేకపోయినా.. వైసీపీ మద్దతుగా నిలుస్తున్న ఓట్ బ్యాంక్ ను చీల్చటమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో గెలిచి తమ పట్టు నిరూపించుకోవటం మిధున్ రెడ్డి(Mithun Reddy)కి సవాల్ గా మారుతోంది. దీంతో..రాజంపేట తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలతో ఎన్నికల వేళ చోటు చేసుకొనే పరిణామాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+