కడప రెడ్డమ్మపై పోస్టులు..! మాజీ డిప్యూటీ సీఎంకు షాక్..!

ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఎలాంటి మార్పూ లేదు. అధికారంలో ఉన్న పార్టీలు, విపక్ష పార్టీలు అన్న తేడా లేకుండా ప్రత్యర్దులపై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇదే క్రమంలో తాజాగా కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ నేతలకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాత్ బాషాకు పోలీసులు షాకిచ్చారు.

కడపలో పదేళ్లుగా హవా నడిపించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజాత్ బాషా ప్రాభవానికి గత ఎన్నికల్లో గండి పడింది. చాలా కాలం తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగిరింది. కడప ఎమ్మెల్యేగా రెడ్డప్పగారి మాధవీరెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె స్థానికంగా బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియాలో వార్ కు వైసీపీ తెరలేపింది.

ex-deputy cm amzath basha s PA detained for defamatory social posts on Kadapa mla madhavi

ఇదే క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాత్ బాషా పీఏ ఖాజా ఎమ్మెల్యే మాధవీరెడ్డిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. వీటిని సీరియస్ గా తీసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇవాళ రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో ఖాజాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడపకు తరలించారు. పట్ఠణ శివార్లలో ఉన్న పోలీసు శిక్షణా కేంద్రంలో ఖాజాను ఉంచి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాజాను అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో వైసీపీ శ్రేణులు పోలీసు శిక్షణా కేంద్రం వద్దకు తరలివస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+